మూత్రపిండాల్లో రాళ్లు చేరకుండా ఉండాలంటే..?
మితంగా ఆహారం తీసుకోండి... ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ ఆహారం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. రోజుకు మనకు 2,200 కేలరీల శక్తి సరిపోతుంది
మితంగా ఆహారం తీసుకోండి... ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ ఆహారం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. రోజుకు మనకు 2,200 కేలరీల శక్తి సరిపోతుంది. ఈ మేరకు శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటే మనకు సరిపోతుంది.
అలాగే ఈ కేలరీలు ఖర్చయ్యేలా కూడా మనం కష్టపడాల్సి వస్తుంది. ఇంతకన్నా ఎక్కువ కేలరీలను ఆహారంలో తీసుకుంటే మాత్రం మనకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
రోజుకు అవసరానికి మించిన కేలరీలను ఆహారంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ముప్పు 42 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనంలో తేలింది. అలాగే రోజూ కొద్దిసేపు వ్యాయామం చేసేవారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు 31 శాతం దాకా తగ్గుతున్నట్టు కూడా ఈ అధ్యయనంలో తేలింది.