రోజూ ముక్కలేనిదే ముద్ద దిగదా..? ఐతే ఈ జబ్బులూ తప్పవ్..
ముక్కలేనిదే ముద్ద దిగదా.. అయితే ఈ జబ్బులు తప్పవ్ అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రోజూ ఆహారంలో చికెన్, మటన్ చేర్చుకునేవారు మీరైతే.. ఇక ఆపండి. ఎందుకంటే రోజూ మాంసాహారం తీసుకునేవారిలో అనారోగ్య సమస్యలు తప్పవ
ముక్కలేనిదే ముద్ద దిగదా.. అయితే ఈ జబ్బులు తప్పవ్ అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రోజూ ఆహారంలో చికెన్, మటన్ చేర్చుకునేవారు మీరైతే.. ఇక ఆపండి. ఎందుకంటే రోజూ మాంసాహారం తీసుకునేవారిలో అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చికెన్, మటన్ అధికంగా తీసుకునేవారిలో అజీర్ణ సమస్యలు, గుండెపోటు, ఒబిసిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి.
గుండె రక్తప్రసరణ మెరుగ్గా వుండదు. హైబీపీ ఏర్పడుతుంది. అందులోనూ ముఖ్యంగా బ్రాయిలర్ చికెన్ తీసుకునే వారిలో లివర్ సమస్యలు తప్పవ్. కానీ ఆకుకూరలు, కాయగూరలు తీసుకునే వారిలో అజీర్తి సమస్యలు వుండవని.. అయితే మాంసాహారం తీసుకుంటే.. జీర్ణక్రియ వేగంగా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శాకాహారం జీర్ణమయ్యేందుకు 4-5 గంటల సమయం పడితే.. మాంసాహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు మూడు రోజుల సమయం పడుతుంది.
అందుకే శారీరక శ్రమ లేకుండా గంటలపాటు కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారు మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండటం మంచిది. శారీరక శ్రమ చేసేవారు మాంసాహారాన్ని తీసుకున్న.. శ్రమించడం ద్వారా కెలోరీలు కరిగిపోతాయి. అంతేకానీ శరీరానికి శ్రమ లేకుండా.. మెదడుకు మాత్రం పనిచ్చే వారు మాత్రం రోజూ మాంసాహారం తీసుకోకూడదంటున్నారు.. వైద్య నిపుణులు.