Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరగడుపున పిల్లలకు క్యారెట్ జ్యూస్ ఇస్తే ఏమవుతుంది?

విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే క్యారెట్‌లో విటమిన్ బి,

పరగడుపున పిల్లలకు క్యారెట్ జ్యూస్ ఇస్తే ఏమవుతుంది?
, బుధవారం, 23 మే 2018 (12:04 IST)
విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే క్యారెట్‌లో విటమిన్ బి, సి, జి లభిస్తాయి. శరీరానకి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది.
 
అతి ఉత్తమమైన, సహజమైన కాల్షియం చక్కటి సమతౌల్యాన్ని అద్భుతంగా క్యారెట్ ఇవ్వగలదు. ఇది మంచి పటిష్టమైన పళ్ళకూ ఎముకలకు, మంచి చర్మానికి కావలసిన అత్యావశ్యకమైన పదార్ధం. అంతేకాదు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
 
పరగడుపున క్యారెట్ రసం తాగితే కడుపులో ఉండే పురుగులు నశిస్తాయి. పిల్లలకు క్యారెట్ రసం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పిల్లలు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా జీర్ణకోశ వ్యాధులు నయమౌతాయి. క్యారెట్ జ్యూస్ జ్ఞాపకశక్తిని కలిగిస్తుంది. రోజూ ఒక గ్లాసుడు క్యారెట్ రసం పిల్లలకు ఇస్తే జ్ఞాపకశక్తికి టానిక్‌లా పనిచేస్తుంది.
 
కామెర్లు, క్షయ, మొలల వ్యాధి ఉన్న వాళ్ళూ రోజూ రెండు క్యారెట్లు తినడం మంచిది. మధుమేహంతో బాధపడేవారు, షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచేందుకు క్యారెట్ ఎంతగానో ఉపకరిస్తుంది. పచ్చడి రూపంలో కూడా క్యారెట్‌ను వాడవచ్చును. చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మజ్జిగలో వేసుకుని తినవచ్చు. క్యారెట్ రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఒక ఐరన్ క్యాప్సూలు బదులుగా ఒక క్యారెట్ తింటే సరిపోతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారానికి ఐదు కోడిగుడ్లు తీసుకుంటే..?