Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వణికిస్తోంది, సూర్యుడిని చూసి 3 రోజులైంది, వర్షాకాలంలో ఏం తినాలి? కరోనాతో పోరాడేదెలా?

కరోనా వణికిస్తోంది, సూర్యుడిని చూసి 3 రోజులైంది, వర్షాకాలంలో ఏం తినాలి? కరోనాతో పోరాడేదెలా?
, శనివారం, 15 ఆగస్టు 2020 (23:00 IST)
Covid-19 మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఈ కరోనావైరస్ సృష్టించే శ్వాసకోశ సమస్యలను నివారించడం, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే మార్గాలు తెలుసుకోవాలి. కరోనావైరస్ మహమ్మారి మధ్య రుతుపవనాల సమయంలో సాధారణ శ్వాసకోశ సమస్యలు వెంటాడుతాయి. అలాంటి సమస్యలను ఈ క్రిందివాటితో అధిగమించవచ్చు.
 
యాపిల్స్ వంటివి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిచేసే పండ్లు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో నిండిన ఆహారాలు, వాల్నట్, బ్రోకలీ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచివి. అదేవిధంగా ఊపిరితిత్తులను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి బీన్స్ సహాయపడుతాయి.
 
బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి వుంటాయి. బొప్పాయి, పైనాపిల్, కివి, క్యాబేజీ, క్యారెట్లు, పసుపు, అల్లం వంటి ఆహారాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. తేనె దగ్గును అణిచివేసేందుకు సహాయపడుతుంది. అలాగే, పొడి దగ్గుతో ఊపిరితిత్తుల్లో ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల గోరువెచ్చని నీరు త్రాగాలి.
 
రోజూ వ్యాయామం చేయాలి. విశ్రాంతి తీసుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి మంచిది. ఆవిరి పీల్చడం ద్వారా శ్లేష్మం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. ఉప్పు నీళ్లతో పుక్కిలించండి. ధూమపానం అలవాటు వున్నవారు దాన్ని మానేయాలి. దగ్గు, తుమ్ము సమయంలో నోరు కప్పి ఉంచేలా చూడండి.
 
ఉబ్బసం వున్నవారైతే మందులను అందుబాటులో వుంచుకోవాలి. క్రమం తప్పకుండా శ్వాస వ్యాయామాలు చేయండి. ఇది ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే దుమ్ము, అలెర్జీ కారకాలు మరియు కాలుష్య కారకాలకు దూరంగా వుండండి. ఇది వర్షాకాలం కనుక వర్షంలో తడిసిపోకండి. ఎక్కడా ఉమ్మివేయవద్దు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఉమ్మి వేయడాన్ని మీరు చూస్తే, ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఈ అలవాటు నుండి వారికి అవగాహన కల్పించండి.
 
రోగనిరోధక శక్తికి సహాయపడే పోషకమైన ఆహారాన్ని తినడం, శారీరకంగా చురుకుగా ఉండటం, వర్షంలో తడిసిపోకుండా ఉండటం, సామాజిక దూరం సాధన చేయడం, బయటకు వెళ్ళేటప్పుడు మాస్కు ఉపయోగించడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ సీజన్ అంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ యాపిల్స్ ఆరోగ్యానికి ఏవిధంగా సాయపడతాయి?