Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యారెట్ - అల్లం ముక్కలతో హెల్తీ జ్యూస్... ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం!

Advertiesment
Health
, శుక్రవారం, 20 మే 2016 (16:46 IST)
శరీరం శక్తిని పుంజుకోవడం కోసం మనం ఆహారాన్ని సరైన వేళలో సరైన మోతాదులో తీసుకుంటాం. అయితే మనం తీసుకున్న ఆహారం రక్తంలో కలిసిన అనంతరం అది శక్తినివ్వడం ద్వారానే మనం మన నిత్యకృత్యాలను చేసుకోవడానికి వీలు కలుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్‌లు, ఖనిజ లవణాలు కలగలిపి ఉంటాయి. ఈ విటమిన్‌లు, ఖనిజలవణాలు శరీరంలోని భాగాలకు సక్రమంగా చేరుకోవాలంటే క్యారెట్, అల్లం కలగలపిన జ్యూస్‌ని తాగాలి. 
 
ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. అలాగే జీర్ణక్రియకు సహకరించే లాలాజల గ్రంథులను ప్రేరేపించి బాగా పనిచేసేలా చేస్తుంది. ఈ జ్యూస్ జీర్ణక్రియకు తోడ్పటమే కాక క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది. అంతే కాకుండా క్యారెట్‌లో చాలా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జ్యూస్‌లో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారు రోజూ తీసుకుంటే చాలా త్వరగా కోలుకుంటారు. నీరసం కూడా దరికి రాకుండా ఉంటుంది.
 
క్యారెట్-  2 
అల్లం ముక్కలు- 1
నిమ్మరసం- తగినంత
తేనె - 1 స్పూన్  
 
క్యారెట్‌ని ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో అల్లం ముక్కలు వేసి అన్ని కలిపి ఒక్కసారి మిక్సీ వేసి అందులో తగినన్ని నీళ్ళు పోసి మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీనిని వడకట్టుకొని అందులో తగినంత తేనె, నిమ్మరసం కలపాలి. పైన పుదీన ఆకులతో వేసి గార్నిష్ చేసి తాగితే సరి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్మ మృతకణాల తొలగింపునకు చక్కెరతో ట్రీట్మెంట్!