Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐస్‌క్రీమ్‌ను అల్పాహారానికి తర్వాత తీసుకుంటే.. ఒత్తిడి తగ్గుతుందట.. చురుగ్గా ఉంటారట..!

వేసవిలో ఐస్‌క్రీమ్ తినాలంటే పిన్నలు.. పెద్దలు ఆసక్తి చూపుతాం. ఐస్‌క్రీమ్ అంటేనే వయోభేదం లేకుండా అందరూ ఇష్టపడి తింటుంటారు. కానీ కొంతమంది.. జలుబు చేస్తుందనే, తలనొప్పి వస్తుందనో ఐస్‌క్రీమ్ తీసుకోకుండా..

Advertiesment
Health Benefits
, సోమవారం, 29 మే 2017 (12:02 IST)
వేసవిలో ఐస్‌క్రీమ్ తినాలంటే పిన్నలు.. పెద్దలు ఆసక్తి చూపుతాం. ఐస్‌క్రీమ్ అంటేనే వయోభేదం లేకుండా అందరూ ఇష్టపడి తింటుంటారు. కానీ కొంతమంది.. జలుబు చేస్తుందనే, తలనొప్పి వస్తుందనో ఐస్‌క్రీమ్ తీసుకోకుండా.. పిల్లలకు ఐస్‌క్రీములు పెట్టకుండా ఉంటారు. అవన్నీ ఉత్తుత్తి భయాలేనని ఐస్ క్రీమ్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.
 
ఉదయం పూట అల్పాహారంతో ఐస్ క్రీమ్ తీసుకునే వారు రోజంతా చురుకుగా ఉంటారని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఐస్‌క్రీమ్‌ను రోజూ అల్పాహారం తర్వాత తీసుకునే వారిలో మెదడు చురుగ్గా పనిచేస్తుందని.. పరిశోధకులు గుర్తించారు. ఐస్ క్రీముల్లో విటమిన్ ఎ, బీ, సీ, డీ, ఈలు వుంటాయి. థయామిన్, నియాసిన్‌లు కలిగివుండే ఐస్ క్రీమ్‌లను తీసుకంటే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఐస్ క్రీముల్లో ఉండే విటమిన్ కె.. శరీరంలో రక్త గడ్డకుండా చేస్తుంది. అంతేగాకుండా ఐస్ క్రీమ్ శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. 
 
వీటిలో ఉండా పాలు వంటి ప్రోటీన్లతో కూడిన పదార్థాలే ఇందుకు కారణం. క్యాల్షియం, ఫాస్పరస్ ఐస్‌క్రీముల్లో ఉండటం ద్వారా ఎముకలు, దంతాల సంరక్షిస్తాయి. ఐస్‌క్రీముల్లోని మినరల్స్ కిడ్నీలోని రాళ్లను కరిగిస్తాయి. ఐస్ క్రీమ్‌ను తీసుకుంటే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఒత్తిడికి గురిచేసే హార్మోన్లను హ్యాపీ హార్మోన్లుగా మార్చేస్తాయి. అంతేకాదండోయ్.. క్యాన్సర్‌ను తగ్గించే గుణం కూడా ఐస్ క్రీముల్లో పుష్కలంగా ఉంది. కోలన్ క్యాన్సర్‌ను ఐస్ క్రీమ్ దూరంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనం చేసిన వెంటనే సోంపు గింజల్ని ఎందుకు తింటారో తెలుసా? రుతుక్రమ నొప్పుల్ని?