Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ లోపాలను అధిగమించేందుకు పచ్చిమిర్చే మార్గం.. ఎలా?

వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిర్చిని వాడుతారు అనుకుంటారు చాలామంది. ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం మిర్చిలోని పోషకాలు ఎన్నో వున్నాయి. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీలైనంతవరకు ఎండు మిరపపొడిని తగ్గించి పచ్చిమిర్చిని వాడేందుకు ప్రయత్నించాల

Advertiesment
ఆ లోపాలను అధిగమించేందుకు పచ్చిమిర్చే మార్గం.. ఎలా?
, సోమవారం, 11 డిశెంబరు 2017 (21:35 IST)
వంటల్లో కేవలం కారం కోసమే పచ్చిమిర్చిని వాడుతారు అనుకుంటారు చాలామంది. ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం మిర్చిలోని పోషకాలు ఎన్నో వున్నాయి. అవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీలైనంతవరకు ఎండు మిరపపొడిని తగ్గించి పచ్చిమిర్చిని వాడేందుకు ప్రయత్నించాలని ఇటీవల వైద్య నిపుణులు సూచించారు. మిర్చిని తురిమి వంటల్లో వేస్తుంటే కారం తెలియకుండా తినొచ్చని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
 
పచ్చిమిర్చిలో విటమిన్-సి ఉంటుంది. అరకప్పు తరిగిన పచ్చిమిర్చితో కనీసం 181 మిల్లీ గ్రాముల సి.విటమిన్ లభిస్తుంది. అది మన శరీరానికి ఒకరోజు ఆరోగ్యంగా ఉండటానికి అన్నమాట. మన ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పడానికి జీర్ణక్రియ ఎంత చురుగ్గా జరుగుతుందో అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ ప్రక్రియ అత్యంత సజావుగా సాగేందుకు పచ్చిమిర్చిలోని సుగుణాలు దోహదపడతాయి. శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది మిర్చి.
 
పట్టణాలు, నగరాల్లో ఉరుకుల, పరుగుల జీవితం సహజం. ఇటువంటి ఆధునిక జీవన శైలిలో హైటెన్షన్‌కు గురికాని వారు అరుదు. ఇలాంటి వాటిని అడ్డుకుంటుంది పచ్చిమిరపకాయ. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటుంది. ఎముకలను పుష్టిగా ఉంచడంతో పాటు వాటికి బలాన్ని కూడా ఇస్తుంది. అంతేకాదు ఎర్రరక్తకణాలను వృద్థి చేసే గుణాలు కూడా మిర్చికి ఉన్నాయి. దాని ద్వారా దృష్టి లోపాలు రావు. ఇందులోని విటమిన్-ఎ చూపు పెరిగేందుకు సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెజ‌వాడ‌లో అద‌ర‌గొట్టిన డిజైన‌ర్ వీక్... వైష్ణ‌వి రెడ్డి ఫ్యాష‌న్ షో