Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యాయామం చేసే చోటు మరీ చల్లగా వుంటే...

వ్యాయామం చేయడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అవసరమైంది. జిమ్, హెల్త్ క్లబ్స్, ఫిట్‌నెస్ సెంటర్స్ అని పలు చోట్లకు వెళుతున్నాం. నగరాలు, పట్టణాల్లో వాకింగ్‌కు వెళ్లే స్థలంతో పాటు తీరిక లేకపోవడంతో ఇంట్లోనే ఓ ట్రెడ్ మిల్లును కొనుగోలు చేసి వాకింగ్ చేస్తుంటా

Advertiesment
వ్యాయామం చేసే చోటు మరీ చల్లగా వుంటే...
, మంగళవారం, 28 మార్చి 2017 (22:02 IST)
వ్యాయామం చేయడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అవసరమైంది. జిమ్, హెల్త్ క్లబ్స్, ఫిట్‌నెస్ సెంటర్స్ అని పలు చోట్లకు వెళుతున్నాం. నగరాలు, పట్టణాల్లో వాకింగ్‌కు వెళ్లే స్థలంతో పాటు తీరిక లేకపోవడంతో ఇంట్లోనే ఓ ట్రెడ్ మిల్లును కొనుగోలు చేసి వాకింగ్ చేస్తుంటారు. లేకపోతే అందుబాటులో ఉన్న వ్యాయామశాలలకు వెళ్లి ఎక్స్‌ర్‌సైజులు చేస్తుంటాం. 
 
అయితే, జిమ్‌కు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వ్యాయామ నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం స్థాపించే జిమ్‌లన్నీ శీతలీకరణ (ఏసీ) సౌకర్యంతోనే ఉంటున్నాయి. మరీ కూలింగ్‌గా ఉండే జిమ్‌లలో వ్యాయామం చేయడం కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే, ఈ జిమ్, హెల్త్ క్లబ్, ఫిట్ నెస్ సెంటర్‌లలో చేరే ముందు వాటికి తగిన గుర్తింపు ఉందా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది. అలాగే, ఈ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చే సిబ్బందికి సరైన విద్యార్హతలున్నాయా? గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికెట్ ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. 
 
వీటితో పాటు.. ఫిట్‌నెస్ సెంటర్ ఆవరణం శుభ్రంగా ఉందో లేదో చూడాలని, పరికరాలన్నీ సరిగా ఉన్నాయా? గదుల్లోకి గాలి వెలుతురు సరిగా వస్తున్నాయో లేదో చూసుకోవాలి. మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి. ఉష్ణోగ్రత సరిపోయినంత ఉండేలా నియత్రించే సౌకర్యం ఉండాలని వైద్యులు సూచన చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోటి దుర్వాసన తొలగిపోవాలంటే? అరకప్పు పెరుగు తిని.. గ్లాసుడు నీళ్లు తాగేయండి..