ఫాస్ట్ ఫుడ్స్ తెగలాగిస్తున్నారా..? కవర్లతో జాగ్రత్త సుమా...!
ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటుపడ్డారా? అయితే వాటిని భద్రపరిచే వ్రాపర్స్‌తో జాగ్రత్త అంటున్నారు.. యూనివర్శిటీ ఆఫ్ ఆలబామా పరిశోధకులు. ఫాస్ట్ ఫుడ్స్‌ను భద్రపరిచే కవర్లు.. ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనా
ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటుపడ్డారా? అయితే వాటిని భద్రపరిచే వ్రాపర్స్‌తో జాగ్రత్త అంటున్నారు.. యూనివర్శిటీ ఆఫ్ ఆలబామా పరిశోధకులు. ఫాస్ట్ ఫుడ్స్‌ను భద్రపరిచే కవర్లు.. ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనాల ద్వారా మనం తీసుకునే ఫాస్ట్ ఫుడ్స్ అనారోగ్యాలను కొనితెచ్చిపెడుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్స్‌ను భద్రపరిచేందుకు ఉపయోగించే వ్రాపర్స్‌లోని టాక్సిన్స్, కార్సినోజెనిక్ టెఫ్లన్ కెమికల్ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు తప్పవని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు.
ఈ విషయం ఫాస్ట్ ఫుడ్స్ ప్యాక్ చేసే పేపర్లు, ప్లాస్టిక్ పదార్థాలను పరిశోధించడంతో వెలుగులోకి వచ్చిందని పరిశోధకులు అంటున్నారు. వ్రాపర్స్ తయారీ కోసం ఉపయోగించే రసాయనాల ద్వారా క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడి తీసుకునే పిల్లల్లో వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు.
జంక్ ఫుడ్స్‌తోనే కాదు.. జంక్ ఫుడ్స్‌ను భద్రపరిచే ప్యాకెట్లతోనూ ఆరోగ్యానికి కీడు జరుగుతుందని.. అందుకే వాటిని తీసుకోవడం చాలామటుకు తగ్గించడం మంచిదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రెడ్, డెసర్ట్స్, బర్గర్లు, పిజ్జాలను ప్యాక్ చేసే వ్రాపర్స్ ద్వారా వాటిని ఆహారంగా తీసుకునే మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఇందుకు వాటి తయారీకి పీఎఫ్ఓఎస్ (పర్-అండ్ పోలిఫ్లూరోల్కిల్ సబ్‌స్టన్స్), టాక్సిక్ సబ్‌స్టన్స్ అనే రసాయనాలు ఉపయోగించడమే కారణమని పరిశోధకులు అంటున్నారు.
ఈ రసాయనాలతో తయారైన కవర్లలో భద్రపరిచే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. మెదడు పనితీరు మందగిస్తుందని, కాలేయం, ఉదరం, ఊపిరితిత్తులు, గర్భాశయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఇంకా కిడ్నీ, టెస్టికులర్ క్యాన్సర్స్, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, సంతానలేమికి కారణం కావడం, థైరాయిడ్ ఏర్పడటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వంటివి తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.