Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుష్పకవిమానాల గురించి మీకు తెలుసా?

పుష్పకవిమానాల గురించి మీకు తెలుసా?
, శనివారం, 28 ఆగస్టు 2021 (11:56 IST)
ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన , రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. మనిషి ఈ ప్రపంచాన్ని జయించాను అని అనుకుంటున్నాడు. కాని ఇప్పటివరకు తెలుసుకున్నది ఒక్క శాతమే . వాటిలో ముఖ్యమైనది పుష్పకవిమానాలు . ప్రస్తుతం చాలా వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి . కాని వాటి గురించి పూర్తి సమాచారం ఎవ్వరికి అందుబాటులో లేదు. 
 
ఒకనాటి భారతీయ చక్రవర్తి సామ్రాట్ అశోకుడు తొమ్మిది మంది గుర్తుతెలియని వ్యక్తులతో ఒక రహస్య విభాగాన్ని ఏర్పరిచాడు. ఇందులోని వ్యక్తుల అపర మేధావులు వీరి ప్రధాన విధి వివిధ రకాల శాస్త్రాలు శోధించి మధించడం . దీనికి ప్రధాన కారణం అంతకు ముందు జరిగిన యుద్ధాలలో జరిగిన దారుణ మారణహోమం , రక్తపుటేరులు చూసి మనస్సు చలించి బౌద్ధమతం స్వీకరించాడు.

ఈ సమయంలో తను అంతకు ముందు నియమించిన రహస్య శాస్త్రవేత్తలు భారతీయ వేదాలు , ప్రాచీన గ్రంధాలు కాచివడబోసి రూపొందించిన ఆధునిక వైజ్ఞానిక సమాచారం బయటకి పొక్కితే దానిని యుద్ధం వంటి దుష్ప్రయోజనాలకి వాడతారేమో అని అశొకుడు భయపడ్డాడు . అందుకే రహస్య విభాగంలోని శాస్త్రవేత్తల కార్యకలాపాల్ని అత్యంత రహస్యముగా ఉంచాడు. 
 
అశోకుడు నియమించిన ఈ తొమ్మిది మంది వ్యక్తులు తొమ్మిది వేరువేరు అమూల్యమైన గ్రంథాలు రచించారు. వాటిలో ఒక అద్బుత గ్రంథం " గురుత్వాకర్షణ శక్తి  రహస్యాలు " దీని గురించి చరిత్రకారులు కు తెలుసు కాని వారు దాన్ని ఎప్పుడూ చూడలేదు . ఈ పుస్తకం ప్రధానంగా "గురుత్వాకర్షణ శక్తి నియంత్రణ" సమాచారం కలిగి ఉంటుంది. ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కడో ఒక రహస్య గ్రంధాలయంలో ఉంటుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు .దీనికోసం చాలామంది రహస్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రంథం టిబెట్ లేదా భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు.  
 
కొన్ని సంవత్సరాల క్రితం టిబెట్ లోని లాసాలో కొన్ని ప్రాచీన తాళపత్రాలు చైనీయులకు లభించాయి. అవి ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయి . వాటిని అనువాద నిమిత్తం భారతదేశంలోని చండీగఢ్ విశ్వవిద్యాలయానికి పంపించారు. వాటిలో గ్రహాంతర అంతరిక్ష వాహనాల నిర్మాణానికి సంబంధించిన సూత్రాలు ఈ పత్రాలలో ఉన్నాయి అని చండీగఢ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలియచేసారు. 
 
లాసాలో లభ్యమైన పత్రాలలో అంతరిక్ష వాహనాలను అస్థ్రాలుగా పేర్కొన్నారు . ప్రాచీన భారతీయులు సదరు వాహనాలలో కొందరు యోధులను ఇతర గ్రహాలకు పంపించి ఉండవచ్చు అని ఈ తాళపత్రాలను పరిశీలించిన డాక్టర్ రైనా తెలియజేసారు. అదృశ్య గ్రాహక శక్తికి పరాకాష్టగా చెప్పుకొనే "యాంటిమ" చిన్న వస్తువుని సైతం కొండంత బరువుగా మార్చే "గరిమ" , పెద్ద వస్తువుని సైతం బరువుతక్కువ గా చేయగల "లగిమ" రహస్యాలు కూడా ఈ ప్రాచీన తాళపత్రాలలో నిగూఢంగా ఉన్నాయి.
 
చైనా ఈ తాళపత్ర గ్రంథాలు పంపినప్పుడు భారతీయ పరిశోధకులు అంత సీరియస్ గా తీసుకోలేదు . ఈ ప్రతుల్లోని కొంత డేటా తమ అంతరిక్ష పరిశోధనల్లో చేరుస్తున్నాం అని చైనా ప్రకటించడంతో అప్పుడు ఆ పత్రాల విలువ భారతీయ పరిశోధకులకు తెలిసివచ్చింది . యాంటి గ్రావిటీ గురించి పరిశోధిస్తున్నాం అని ఒక ప్రభుత్వం ప్రకటించడం ఇదే తొలిసారి .
 
గ్రహాంతర ప్రయాణం అంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని ప్రాచీన తాళపత్రాలు లో అంత వివరంగా లేదు . కాని మొత్తంమీద చూస్తే చంద్రుడిపైకి మాత్రం ఒకసారి యాత్ర జరిగినట్టు వివరిస్తున్నాయి . భారతీయ ప్రాచీన కావ్యం అయిన రామాయణంలో ఒక విమానంతో చంద్రుడి పైకి అంతరిక్ష యాత్ర చేసినట్టు ఉంది . రావణుని మరణం తప్పించడం కోసం మండోదరి అమృత బాండాన్ని చంద్రుడి పైకి వెళ్లి సాధించుకొని వచ్చి రావణుడికి కూడా తెలియకుండా విభీషణుని సహాయంతో రావణుని ఉదరభాగంలో ప్రతిష్టించింది.
 
నిజానికి ఈ పత్రాలు భారతీయులు ఉపయోగించిన యాంటీ గ్రావిటీ , ఏరోస్పేస్ టెక్నాలజీ కి సంబంధించిన ఇటీవల లభ్యమైన చాలా స్వల్పమైన సాక్ష్యాధారాలు మాత్రమే . వారి పూర్తిపరిజ్ఞాన్ని మనం అర్ధం చేసుకోవాలి అంటే మనం కాలచక్రంలో చాలా వెనకకి వెళ్లవలిసిందే . 
 
ఉత్తర భారతదేశం ,పాకిస్తాన్ లో  ఉండేది అని చెబుతున్న  "రామరాజ్యం" పదిహేను వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో వికాసం చెందింది. ఈ రాజ్యంలో చాలా పెద్ద ఆధునిక నగరాలు ఉండేవి. వీటిలో చాలామటుకు నగరాలను పాకిస్తాన్ , ఉత్తరపశ్చిమ భారత ఎడారుల్లో ఇంకా కనుగొనవలసి ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం మద్యభాగంలో "అట్లాంటియన్ " నాగరికత విలసిల్లిన సమయంలో ఇక్కడ భరత ఖండంలో రాముడు రాజ్యం చేసాడు .

రామరాజ్యంలోని గొప్ప నగరాలు మన పురాణాల్లో "సప్తఋషి" నగరాలుగా ప్రసిద్ది చెందాయి. ఈ నగరాల్లో నివసించే ప్రజలు విమానాలుగా పిలిచే యంత్ర వాహనాలు ఉపయోగించే వారని ప్రాచీన బారతీయ గ్రంథాలలో ఉన్నది . భారతీయ పురాణాలు విమానాన్ని అంతర్గత నిర్మాణంలో రెండు అంతస్తులు , పైభాగాన గుమ్మటం ( డోము ) బయట చుట్టూరా రంధ్రాలు ఉండే వృత్తాకార వాహనంగా తెలియచేశాయి .   
 
ఈ విమానం అనేది వాయువేగంతో గగనతలంలోకి దూసుకెళ్తూ ఇంపుగా ఉండే హృద్యమైన శబ్దాన్ని వెలువరించేది అని ఆ గ్రంథాలలో పేర్కొనబడినది. అప్పట్లో కనీసం నాలుగు రకాల విమానాలు ఉండేవి . ఈ విమానాల్ని తయారుచేసిన ప్రాచీన భారతీయులు ఆ విమానాలని ఎలా నడపాలో ఫ్లైట్ మాన్యువల్స్ కూడా రూపొందించారు. ఈ విమానాల్లో కొన్ని సాసర్ ఆకారంలో మరికొన్ని సిగిరెట్ ఆకారం లో నిలువుగా కూడా ఉండేవి . 
 
విమాన వాయు ప్రయాణం పైన సంపూర్ణంగా వివరించిన అత్యంత ప్రాచీన గ్రంథం  "సమరసూత్రధార" ఈ గ్రంధంలో విమానం తయారి , అది బయలుదేరే తీరు , వేలాది మైళ్ళు ప్రయాణించుటకు కావలిసిన వివరాలు , బలవంతంగా దానిని కిందకి దించే విధానం , ఆఖరికి ప్రయాణ సమయంలో పక్షులతో ఢీకొట్టటానికి ఉన్న అవకాశాలతో సహా ప్రతి విషయాన్ని విశదపరిచే 230 శ్లోకాలు ఈ గ్రంధరాజంలో ఉన్నాయి. 
 
క్రీస్తు పూర్వం 4 వ శతాబ్దంలో భరద్వాజ మహర్షి రాసిన అద్బుత గ్రంథం "భరద్వాజ వైమానిక శాస్త్రం" ఈ గ్రంధాన్ని 1875 వ సంవత్సరం లో ఒక ఆలయంలో కనుగొన్నారు. విమానాల పనితీరుపైన ఇందులో చాలా ఆసక్త్తికరమైన ముఖ్యవిషయాలు ఉన్నాయి . విమానాన్ని ఎలా నడపాలి , దూరప్రాంతానికి ప్రయాణించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హఠాత్తుగా విరుచుకుపడే పిడుగులు , మెరుపులు నుంచి విమానాన్ని ఎలా రక్షించుకోవాలి వంటి ముఖ్యవిషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. 
 
భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో చాలా వివరాలు విపులంగా రాసి ఉన్నాయి . విమానం నడిపేటప్పుడు ఇంధనం ఉపయోగించి మాత్రమే కాకుండా మరోక ఉచిత ఇంధన వనరుని కూడా ఉపయోగించుకోవడం పై విస్కృత సూచనలు ఉన్నాయి . బహుశా ఆ ఉచిత ఇంధనవనరు యాంటి గ్రావిటి కావొచ్చు అని పరిశోధకుల అభిప్రాయం . ఇదే వైమానిక శాస్త్రంలో ఇంధనం నుంచి సౌరశక్తి ఉపయోగించి విమానం నడపడం గురించి కూడా సూచనలు ఉన్నాయి . 
 
"వైమానిక శాస్త్ర " లో నిప్పంటుకోని,విరగని సామగ్రి , పరికరాలతో సహా మూడు రకాల విమానాల వర్ణనలు , బొమ్మలతో కూడిన ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి . ఈ వాయువాహనాల్లో ని 31 ప్రధాన భాగాలను , వాటి తయారీకి ఉపయోగించే 16 పదార్థాలు , సామాన్లను కూడా ఈ శాస్త్రం వివరిస్తుంది. ప్రధాన భాగాల తయారికి ఉపకరించే సామాన్లు , పదార్థాలు వేడిమికి , మంటలకు తట్టుకునే కోవకి చెందినవి అని అందుకే విమాన తయారీలో ఈ పదార్థాలు వాడాలి అని స్పష్టంగా సూచించాడు . 
 
ఈ విమానాలు ఒక రకమైన యాంటి గ్రావిటీ తో పనిచేస్తాయి అనేందుకు ఎటువంటి సందేహాలు అక్కరలేదు అని చెప్పుకోవచ్చు. విమానాలు నిలువుగా గాలిలో లేచేవి . ప్రాచీన కాలంలో గగనవిహారం పైన దాదాపు 70 మంది సాధికార వ్యక్తులు , 10 మంది నిపుణులను భరద్వాజ మహర్షి తన గ్రంథంలో ప్రస్తావించారు.కాని వారు లిఖించిన గ్రంథాలు ప్రస్తుతం లభించడం లేదు . 
 
విమానాలని విమానగృహాలుగా చెప్పబడే వాటిలో భద్రపరచేవారు. విమానాలను కొన్నిసార్లు పసుపుఛాయతో ఉండే తెల్లనిద్రవంతో మరికొన్నిసార్లు ఒకరకమైన పాదరస సమ్మేళనంతో నడిపేవారు అని తెలుస్తుంది . ఈ ఇంధనం విషయంలో చాలమంది పరిశోధకులు సరైన అవగాహనకి రాలేకపోయారు . ఈ విమానాలలో ఈ ప్రత్యేక ఇంధనం ఉపయొగించుటకు పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేసి ఉంటారు .
 
ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాజీలు తమ V -8 "బజ్ బాంబులు" కోసం మొట్టమొదటిసారిగా పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేశారు . ప్రాచీన భారతావని , టిబెట్ అంటే నాజీలు , వారి అధినాయకుడైన హిట్లర్ కు పడిచచ్చేంత ఆసక్తి చూపేవారు . ఈ దేశాల్లోని ప్రజలు ప్రాచీన కాలంలోనే మంచి వైమానిక పరిజ్ఞానం సాధించారు అని హిట్లర్ కి నమ్మకం . 
 
ప్రాచీన భారతావని మరియు టిబెట్ లోని ప్రాచీనులు మంచి వైమానిక పరిజ్ఞానాన్ని సాధించారు అని హిట్లర్ కి అత్యంత గాఢ విశ్వాసం . ఈ నమ్మకంతోనే అందుకు కావలసిన "రహస్య సాక్ష్యాధారాలు" కోసం వాటిని సేకరించడానికి 30 వ దశకం మొదలుకొని ప్రతి ఏడాది ఈ రెండు దేశాలకు రహస్యంగా ప్రతినిధి బృందాలను పంపేవాడు.
 
మహాభారతంలోని ద్రోణ పర్వంలో మరియు రామాయణంలో ఒక విమానాన్ని వర్ణించిన తీరు ఈ విధంగా ఉన్నది. విమానం గుండ్రంగా ఉన్నది. పాదరసం వెలువరించే శక్తితో అది గొప్ప వాయువేగంతో దూసుకెళ్లేది చోధకుడు దానిని అన్నివైపులా తిప్పగలిగేలా ఉండేది . మరో ప్రాచీన గ్రంథం "సమర" లో లో పేర్కొన్న విమానాలు ఇనుముతో చక్కగా చేసినవి . వెనుక భాగంలో మండే అగ్నికీలల్ని వెలువరిస్తూ మండే పాదరసం నుంచి వెలువడే శక్తితో పనిచేసేవి అని రాయబడి ఉన్నది. 
 
"సమరాంగణ సూత్రధార " ఈ వాహానాలని ఎలా నిర్మించారో వర్ణించింది. పాదరసానికి విమాన చోదనకు మధ్య ఏదో బలీయమైన సంభంధం ఉన్నది. నేను చదివిన ఒక తాంత్రిక గ్రంథంలో కోడిగుడ్డులో పాదరసం నింపి ఎండలో ఉంచిన అది గాలిలో ఎగురును అని రాసి ఉన్నది.
 
సోవియట్ పరిశోధకులు తుర్కుమెనిస్థాన్ మరియు గోబీ ఎడారులలో గల ప్రాచీన గుహల్లో కొన్ని అపూర్వమైన పరికరాలు కనుగొన్నారు . వాటిని పూర్తిగా పరిశీలించినప్పుడు అవి ఎగిరే వాహనాలలో ఉపయోగించేవిగా నిర్ధారణ అయ్యింది . ఈ పరికరాలు గాజు మరియు పోర్సోలిన్ తో తయారుచేసిన అర్ధగోళాలు వీటిచివర్లు మొనదేలి ఉన్నాయి . లోపల కొన్నిచుక్కల పాదరసం లభించింది. 
 
రామరాజ్యంలో సప్తఋషి నగరాలలో ఒకటిగా భావిస్తున్న మొహంజదారో కనుగొన్న లిపి వంటిదే ప్రపంచంలో మరో ప్రాంతంలో కూడా లభ్యం అయ్యింది .కాని ఆ లిపి యొక్క అర్థం ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. మొహంజదారోలో లిపిని పోలిన లిపి లభించిన ప్రాంతం ఈస్టర్ ఐలాండ్ ఇక్కడ ఈ లిపి ని రాంగో లిపి అంటారు. ఈ రెండు లిపిలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.
 
భవభతి రచించిన మహావీర ప్రాచీన పతులు అనే గ్రంథం ఎనిమిదోవ శతాబ్దం నాటిది . ఈ గ్రంథంలో అయోధ్య ప్రాంతంలోని ఒక విమానం గురించి విపులంగా ఉన్నది. అదే విధంగా వేదాలు కూడా ఈ విమానాల గురించి వాటిలో ఉండే రకాలు ఆకారాలు గురించి ఎన్నో విషయాలు తెలియచేశాయి . అట్లాటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన ఎన్నో భయంకర యుద్ధాలు గురించి చాలా చక్కగా వివరణ ఉన్నది. భారతీయ వేదాలు అత్యంత ప్రాచీన ప్రతులుగా పేరుగాంచాయి. ఇవి హిందూ ప్రాచీన శ్లోకాల మణిహారాలు . ఇవి వివిధ ఆకారాల్లో , పరిమాణాల్లో ఉన్న విమానాల గురించి పలురకాలుగా వివరించాయి.  
 
"అగ్నిహోత్ర విమానం" రెండు ఇంజన్ల తో ఉంటుంది. "గజవిమానం" అనేక ఇంజన్లతో ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ విమానాల్ని యుద్ధాలకొరకు ఉపయోగించారు అట్లాంటిస్ నగర వాసులు ఉపయోగించిన విమానాల కంటే ప్రాచీన భారతీయులు ఉపయోగించిన విమానాలు శక్తివంతం అయినవి. పరిశోధకుల అబిప్రాయం ప్రకారం ఇవి 80,000 హార్స్ పవర్ శక్తితో నడిచేవి . 
 
పది నుంచి పన్నెండువేల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన భయంకర సంగ్రామం గురించి ప్రాచీన భారతీయ గ్రంథాలలో విపులంగా ఉన్నది. ఆనాటి యుద్ధంలో భయంకరమైన విద్వంసక ఆయుధాలు ఉపయోగించారు . వాటిలో అప్పుడు జరిగిన యుద్దం గురించి ఈ విధంగా వివరణ ఉన్నది. 
 
" ప్రయోగించిన ఆయుధం విశ్వమంతటి శక్తిని నింపుకొని ఉన్నది. కొన్ని క్షణాల తరువాత ఎక్కడ చూసినా మేఘాలుని ఆవరించిన పొగ ...ఒక్కసారిగా వేయి సూర్యబింబాలు ఉదయించినట్టుగా జ్వాలవంతమైన వెలుగులతో నిండిన అగ్నికీలలు ...మహోగ్రమైన ఉరుముల గర్జన బ్రహ్మన్దమైన మృత్యుసందేశ వాణి ఇవన్ని కలిసి అంధకుల జాతి సమస్తాన్ని సమూలంగా తుడిచిపెట్టాయి."
 
పంటలు మంటల్లో గుర్తుపట్టలేనంతగా మండిపోయాయి. మట్టివస్తువులు ,ఇళ్లు తునాతునకలు అయ్యాయి మిన్ను మన్ను ఏకమైపోయాయి. పక్షులు తెల్లటి రంగులో మారిపోయాయి. కొన్ని గంటల తరువాత ఆహారపదార్థాలు అన్ని ఆ ప్రళయ బీభత్సానికి గురిఅయ్యాయి. దానిబారి నుంచి రక్షించుకొనుట కొరకు , తమ దేహాలు , ఆయుధాలు, వస్తుసామాగ్రి శుభ్రపరచుకోవడం కొరకు సైనికులు మడుగులు , కాలువల్లోకి దూకారు . ఇది అంతా చూస్తుంటే మహాభారతం అణు యుద్ధాన్ని గురించి వివరిస్తున్నట్టుగా ఉన్నది. 
 
గత శతాబ్దంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మహేంజదారో నగరంలో తవ్వకాలు జరిపినప్పుడు ఏదో విలయం హఠాత్తుగా విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది అన్నట్టుగా ఆ నగరం వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉన్న అస్థిపంజరాలు కనిపించాయి. ఆ అస్థిపంజరాలలో కొన్నిటికి చేతులు ముడుచుకొని ఉండటం గమనించారు. వాటిని పరీక్షించినప్పుడు ఈ భూమ్మీద ఇప్పటివరకు కనుగొన్న అత్యంత ఎక్కువ రేడియో ధార్మిక ప్రభావానికి గురి అయ్యినట్టుగా తేల్చారు.

ఇటుకలు, గాజు కరిగి ముద్దలా పడివున్నాయి . ఒకరకంగా చెప్పాలి అంటే హిరోషిమా , నాగసాకి నగరాల మీద ప్రయోగించిన అణుబాంబులు కంటే కూడా శక్తివంతమైన అణుబాంబుల ప్రయోగం జరిగింది.ఇలాంటి పరిస్థితుల గల నగరాలు ప్రాన్స్ , టర్కీ , స్కాట్లాండ్ దేశాలలో కూడా కనిపించాయి . 
 
మహేంజదారో వీధులలో గాజు గోళాల వంటి నల్లటి పదార్థం పెద్దమొత్తంలో పేరుకొనిపోయింది. వీటిని పరిశీలించగా అత్యంత వేడిమిదగ్గర కరిగిన మట్టికుండలు అని తేలింది . ఇక్కడ ఇంకొ ఆసక్తికరమైన అంశం ఇంకొకటి ఉన్నది . మహాసామ్రాజ్య అధినేత అలెగ్జాండర్ రెండువేల సంవత్సరాల క్రితం భారతదేశం పైన దండయాత్రకు వచ్చినపుడు అలెగ్జాండర్ సైన్యం పైన పళ్లెం వంటి ఆకారాలు కలిగిన వాయువాహనాలు విరుచుకుపడ్డాయి అని కాని ప్రమాదకర ఆయుధాలు ప్రయోగించలేదని గ్రీకు చరిత్రకారుల తమ గ్రంథాలలో రాశారు. 
 
ఆధునిక పరిశోదకుల అబిప్రాయం ప్రకారం ఈ ప్రాచీన విమానాలు అంతరించలేదు అని వాటిని కొన్ని ప్రత్యేకమైన రహస్య ప్రదేశాలలో ఉంచి వాటిని కొన్ని రహస్య సంఘాలలో సభ్యులు కాపలాగా ఉంటున్నారు అని భావిస్తున్నారు. పశ్చిమ చైనా దేశంలోని లాపనార్ ఎడారి ఈ విమానాలకు మిస్టరీ ప్రదేశంగా ఉన్నది . బహుశా ఈ ఎడారిలోనే చాలా విమానాలని రహస్యంగా దాచి ఉంచారు అని చెప్పుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేనెను అలా వాడకూడదు, వాడితే సమస్యలే...