రోజూ నువ్వుల నూనెతో పళ్లు తోముకుంటే..?
రోజూ పళ్లు తోముకున్న తర్వాత చెంచా నువ్వుల నూనెతో చిగుళ్లపై మర్దనా చేసుకోవాలి. చెంచా నువ్వులు నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తింటూంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లల
రోజూ పళ్లు తోముకున్న తర్వాత చెంచా నువ్వుల నూనెతో చిగుళ్లపై మర్దనా చేసుకోవాలి. చెంచా నువ్వులు నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తింటూంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లలో కాస్త ఉప్పు వేసి, ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేస్తే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
దంతాల్ని ఆరోగ్యంగా ఉంచడంలో క్యాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. పాలు, పెరుగు, చీజ్, సోయా, రాగులు తీసుకోవాలి. పళ్లకు హానిచేసే బిస్కెట్లు, చాక్లెట్లు, తీపిపదార్థాలు, మైదా వంటివి తగ్గించుకోవాలి.
నిద్ర లేవగానే, రాత్రిపూట నిద్రకి ముందు రెండు పూటలా పళ్లు తోముకోవాలి. నోట్లో హానికారకమైన బ్యాక్టీరియాలు ఎక్కువ. ఇవి రాత్రిపూట పళ్లలో మిగిలిన ఆహారంపై జీవించి పళ్ల అనారోగ్యానికీ, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌కి దారితీస్తాయి. అందుకే రాత్రి పళ్లు తోముకోవడం తప్పనిసరి. అలాగే ఆహారం తిన్న ప్రతిసారీ నోట్లో నీళ్లు పోసుకొని బాగా పుక్కిలించి ఉమ్మేయడం మంచిదని డెంటిస్టులు చెప్తున్నారు.