Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏడుపు ఆరోగ్యానికి మంచిదే..!

Advertiesment
Crying
, శుక్రవారం, 8 ఏప్రియల్ 2016 (09:53 IST)
ఆనందం, విషాదం... ఇవన్నీ జీవితంలో భాగమే. ఆటలు, పాటలు, స్నేహితులు మరియు కబుర్లలో కొంతమంది ఆనందాన్ని వెతుక్కుంటే... మరి కొంతమంది అందరితో కలిసి పంచుకునే ఆనందం కంటే, వ్యక్తిగత ఆనందానికి పెద్దపీట వేస్తుంటారు. ఇక విషాదం విషయానికి వస్తే... కొంత మంది బోరున ఏడ్చేస్తే, మరికొంత మంది లోలోపలే కుమిలిపోతుంటారు. అయితే, ఆనందం వల్ల శరీరానికి కలిగే మేలు సంగతిని కాసేపు పక్కన పెడితే... విషాదం మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదని, అది లేకపోతే మానవ జీవితానికి అర్థమే లేదని పరిశోధకులు చెబుతున్నారు.
 
ఆత్మీయుల మరణం, ప్రేయసి లేదా ప్రియుడు దూరమవడం, ఆర్థికంగా కష్ట నష్టాలు, కుటుంబ సమస్యలు లాంటివి జీవితంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషాదాలు. ఎంత ఆనందంగా ఉండేవారైనా జీవితంలో ఎప్పుడో ఒకసారి విషాదాన్ని అనుభవించక తప్పదు. అలాంటి విషాదాలు ఎదురైనప్పుడే... మనిషికి తాము చేసే తప్పులేంటో విశ్లేషించుకునే అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. బాధ కలిగినప్పుడు దానిని అనుభవించటం వల్ల ఏదో ఒక ప్రయోజనం తప్పకుండా ఉంటుందని.. లేదంటే, దాన్ని భరించాల్సిన అవసరమే లేదని వారంటున్నారు.
 
సాధారణంగా బాధ కలిగిన క్షణంలో ఏ పనీ చేయలేమనీ,  మనస్సు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుందని అయితే నిజానికి అలా ఆలోచనలు నిలిచిపోవడం అంటూ ఏమీ ఉండదని నిపుణులు అంటున్నారు. కాకపోతే, దేనివల్ల బాధ కలిగిందో, ఆ విషయం గురించే ఎక్కువగా ఆలోచించటం వల్ల... మిగతా ఏ విషయాలపైకి దృష్టి వెళ్లదని అన్నారు.
 
విషాదం కూడా మనకు మేలే చేస్తుంది. అది, గుండెల నుండి మోయలేని భారాన్ని తొలగించి, ఫ్రెష్‌గా తయారు చేయడమే గాకుండా, ఏదైనా విషయాలపై మనం తీసుకునే నిర్ణయాల్లో కూడా స్పష్టత కలిగి ఉండేలా చేస్తుంది. కాబట్టి, హాయిగా విషాదంలో మునిగిపోండి... ఆరోగ్యంగా ఉండండి...!

Share this Story:

Follow Webdunia telugu