Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్త్రీపురుషుల్లో సంతాన లేమికి కారణాలివే...

వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు మాత్రం కలగరు. దీంతో ఆ దంపతులు మానసికంగా కుంగిపోతుంటారు. అందుకే సంతానలేమి చాలా సున్నితమైన అంశంగా పరిగణిస్తారు.

Advertiesment
Fertility Problems
, శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:59 IST)
వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు మాత్రం కలగరు. దీంతో ఆ దంపతులు మానసికంగా కుంగిపోతుంటారు. అందుకే సంతానలేమి చాలా సున్నితమైన అంశంగా పరిగణిస్తారు. ఇది మానసికంగా, శారీరకంగా ఎంతో బాధను కలిగిస్తుంది. ఒక యేడాది పాటు ఎలాంటి సంతాన నిరోధక పద్ధతులు అవలంభించకుండా శృంగారంలో పాల్గొన్నప్పటికీ పిల్లలు పుట్టకపోతే సంతానలేమిగా చెప్పవచ్చు.
 
ఈ సమస్యకు పురుషులలో 40 శాతం కారణాలుంటే, స్త్రీలలో 40 శాతం కారణాలుంటాయి. మిగతా 20 శాతం ఇద్దరిలో ఉంటాయి. కాబట్టి అన్ని కారణాలను సమీకరించి చికిత్స చేస్తే సత్ఫలితాలను చూడొచ్చని వైద్యులు చెపుతుంటారు.
 
ముఖ్యంగా పురుషులలో వీర్యకణాల సంఖ్య, కదలికలు, అంగస్తంభన సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, వెరికోసిల్‌ వంటి కారణాలను గుర్తించి చికిత్స చేయాలి. స్త్రీలలో హార్మోనల్‌ అసమతుల్యత, ఫైబ్రాయిడ్స్‌, స్థూలకాయం, రుతుక్రమంలో సమస్యలు, పీసీఓడిలాంటి కారణాలను గుర్తించి చికిత్స చేయాలి. నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స, చేస్తే ఖచ్చితంగా సంతానలేమి సమస్య నుంచి గట్టెక్కవచ్చని వారు చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ కుంకుడు గింజంత పసుపు ఉండలాగ చేసుకుని నీటితో మింగితే...