ఉదయానే చద్ది అన్నం తినడం ఇప్పటికీ పల్లెల్లో, పట్టణాల్లోనూ వుంది. చద్ది అన్నం ఓ సంప్రదాయ ఆహారం. చాలా మంది చద్ది అన్నం తింటే నిద్ర వస్తుందని, నీరసంగా ఉంటుందని అనుకుంటారు. చద్ది అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాము. చద్ది అన్నం ప్రయోజనకరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. ఉదయాన్నే చద్ది అన్నం తింటే కడుపు సంబంధిత వ్యాధులు నయమవుతాయి.
చద్ది అన్నం తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి చల్లగా ఉంటుంది. అలర్జీ సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలకు చద్ది అన్నం మంచి మందు. చద్ది అన్నం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. చద్ది అన్నంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
చద్ది అన్నం లోని నీళ్లను తాగితే కడుపులోని క్రిములు నశించి పొట్ట పరిశుభ్రంగా ఉంటుంది. చద్ది అన్నం తింటే శరీరం యవ్వనంగా కనిపిస్తుందని అంటారు.