Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నాన్ని వేడి చేస్తున్నారా? అయ్య బాబోయ్.. కాస్త ఆగండి..!

ఒకసారి వండిన తర్వాత దాన్ని తిరిగి వేడిచేయడం అనేది వద్దే వద్దు. ఎప్పటికప్పుడు వండుకు తినేయడాన్ని మించిన ఆరోగ్యసూత్రం మరోటి లేదు. ఇంకా ప్రతిరోజూ తినే అన్నాన్ని వేడిచేసి తినకూడందుటున్నారు ఆరోగ్య నిపుణులు

Advertiesment
Can reheating rice cause food poisoning?
, సోమవారం, 29 ఆగస్టు 2016 (11:25 IST)
ఒకసారి వండిన తర్వాత దాన్ని తిరిగి వేడిచేయడం అనేది వద్దే వద్దు. ఎప్పటికప్పుడు వండుకు తినేయడాన్ని మించిన ఆరోగ్యసూత్రం మరోటి లేదు. ఇంకా ప్రతిరోజూ తినే అన్నాన్ని వేడిచేసి తినకూడందుటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫుడ్‌ స్టాండర్డ్‌ ఏజెన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. గది ఉష్ణోగ్రతలో అన్నం పెడితే.. స్పోర్స్ ‌(బీజ పరాగములు) రెట్టింపవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినట్టవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

అలాంటి అన్నాన్ని తినడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. తిరిగి వేడిచేయడం వల్ల హానికలిగించే విషపదార్థాలు నాశనం కావు. అందుకని ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు వండుకుని తాజాగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 
 
అలాగే పుట్టగొడుగులను సరిగ్గా నిల్వ చేయలేకపోయినా.. తిరిగి వేడిచేసినవి తిన్నా పొట్ట పాడైపోతుంది. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన 24 గంటల లోపు వేడి చేసుకుని తీసుకోవచ్చు. ఉడికించిన బంగాళాదుంపలను వేడిచేయడం ద్వారా క్లొస్ట్రీడియమ్‌ బొటులినమ్‌ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందుకే బంగాళాదుంపని ఉడికించాక చల్చార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలే తప్ప బయట ఉంచకూడదు. 
 
ఇంకా పాలకూరలో అధిక గాఢత కలిగిన నైట్రేట్‌ ఉంటుంది. తరువాత ఇదే నైట్రోజమైన్స్‌గా మారుతుంది. ఇది కార్సినోజెనిక్‌. ఈ పదార్థం రక్తప్రసరణ ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. దీన్నే ‘‘బేబీ బ్లూ సిండ్రోమ్‌’’ అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. అలాగే కోడిమాంసం ఉడికించేటప్పుడు కుక్కర్‌ను ఉపయోగించాలి. 
 
కోడి మాంసాన్ని ఉడికించేటప్పుడు ముక్కలు అన్ని వైపులా ఉడికేలా జాగ్రత్త పడాలి. లేదంటే చికెన్‌లో కొద్దిమొత్తంలో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా మీ పొట్టకు పనిచెప్తుంది. మైక్రోవేవ్‌లో త్వరగా అవుతుంది కాని అన్ని వైపులా సరిగ్గా ఉడకదు. దాంతో చికెన్‌లో ప్రొటీన్లు భిన్నంగా విడిపోయి పొట్టను ఇబ్బందిపెడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీర్ణశక్తికి ఒత్తిడికి లింకుందా..? సూప్స్, సలాడ్స్ తీసుకుంటే..?