ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవచ్చా లేదా అనే అనుమానం చాలామందిలో వుంటుంది. అలాంటి వారు మీరైతే ఖాళీ కడుపుతో ఏ పండ్లను తీసుకోవచ్చో తెలుసుకోవచ్చు.
అరటిపండు: ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఇందులో పిండిపదార్థాలు, సహజ చక్కెరలు అనే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పుచ్చకాయ: పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. రాత్రి తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో పుచ్చకాయను తీసుకోవడం వల్ల శరీరం వేడి చేయదు. అలాగే, ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది,. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. గుండె, చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
యాపిల్ : రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లనవసరం లేదని చెబుతారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో యాపిల్ పండ్లను ఎక్కువగా తీసుకోవచ్చు. అందులోని పెక్టిన్ అనే పదార్ధం ఒక రకం. ఫైబర్. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు కార్యకలాపాలు తాజాగా ఉంటాయి.
నేరేడు పండు: ఖాళీ కడుపుతో నేరేడు పండు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఆంథోసైనిన్లు ఉంటాయి. ఈ పండ్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే, శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది