జలుబు. కూర్చోనీయదు, పడుకోనీయదు. జలుబు వచ్చినవారికే తెలుస్తుంది ఆ బాధ. బహు చెడ్డది జలుబు. చాలా ఇబ్బంది పెడుతుంది. వళ్లంతా హూనం చేస్తుంది. ఐతే ఈ జలుబు ఈ కరోనా కాలంలో మంచిదేనంటున్నారు పరిశోధకులు. ఎందుకో తెలుసా?
సహజంగా సీజన్లు మారుతున్నప్పుడు జలుబు చేయడం మామూలే. ఐతే ఇలాంటి జలుబులు ఇప్పుడు మంచివని అంటున్నారు సైంటిస్టులు. ఈ జలుబు కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, ఫలితంగా కరోనావైరస్ రాకుండా ఇది అడ్డుకుంటుందని అంటున్నారు.
అధ్యయనంలో భాగంగా గతంలో కరోనావైరస్ కారణంగా జలుబు చేసిన రోగులను పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థ మెమొరీ బి కణాలను వైరస్‌ను గుర్తుపెట్టుకుని వాటిని పారదోలతాయట.
ఒకవేళ తిరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినా ఈ కణాలు అడ్డుకుంటాయట. దానికి కారణంగా జలుబు చేసిన తర్వాత కొన్ని రోజుల వరకూ మెమొరీ కణాలు అలాగే వుండిపోతాయట. అందువల్ల జలుబు చేసిన వారికి కరోనావైరస్ అంత త్వరగా రాకపోవచ్చని చెపుతున్నారు.