Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొండి చుండ్రుతో తల ఒకటే జిల జిల... ఏంటి మార్గం

Advertiesment
చుండ్రు
WD
ప్రపంచ జనాభాలో సుమారు 80 శాతం మంది నేడు చుండ్రు సమస్యను ఎదుర్కొంటున్నారు. చుండ్రు తగ్గడానికి శాశ్వత పరిష్కారం లేదు. అయితే దానిని నియంత్రించుకోవడానికి మాత్రం అనేక మార్గాలున్నాయి. ఆరోగ్యవంతమైన జీవన విధానం, ఒత్తిడి లేమివల్ల కూడా చుండ్రు నియంత్రణలోనికి వస్తుంది. మాడుపై తెల్లని పొలుసు రేగడం, దురద, చుండ్రు ప్రధాన లక్షణాలు.

నివారణ ఎలా...
నిజం చెప్పాలంటే చుండ్రు నివారణకు ప్రత్యేక చికిత్స లేదు. చుండ్రును నియంత్రించే ఉద్దేశ్యంతో రూపొందించిన షాంపూలు చర్మ పరిస్థితిని నియంత్రించండంలో బాగా పనిచేస్తాయి. షాంపూను తలకు పట్టించి, నురగ వచ్చేవరకూ రుద్ది కడిగేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అలాకాక మాడుపై షాంపూను అప్లై చేసి కనీసం ఏడెనిమిది నిమిషాలున్న తర్వాత తలంటుస్నానం చేయాలి. దీనివల్ల యాంటీ ఫంగల్ లక్షణాలు బాగా పనిచేస్తాయి.

చుండ్రు తెచ్చే సమస్యలు
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతుంది. ముఖం, వీపు, మెడలపై మొటిమలకు కారణం అవుతుంది. తలనొప్పికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. చుండ్రుతోపాటు ముఖంపై అవాంఛిత రోమాలు, స్థూలకాయం, ఋతుక్రమంలో తేడాలు ఉన్నట్లయితే, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఉందేమో తెలిపే వైద్య పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

చుండ్రుతో తరచూ ఇబ్బందిపడేవారు మాడుపై పొట్టురేగడం తగ్గగానే, యాంటీ డాండ్రఫ్ షాంపూను వాడకాన్ని ఆపేస్తారు. కానీ ఇలా చేయకూడదు. షాంపూ వాడకాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. చాలామంది స్త్రీ, పురుషులకు వేర్వేరు షాంపూలుంటాయని అంటుంటారు. కానీ ఇది నిజం కాదు. చుండ్రుకు లింగ వివక్ష ఉండదు. చికిత్స ఎవరికైనా ఒక్కటే.

Share this Story:

Follow Webdunia telugu