Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒత్తిడిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచే ఉల్లిపాయ!

Advertiesment
Onions
, శనివారం, 5 జులై 2014 (18:07 IST)
ఒత్తిడిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఉల్లిపాయల్ని మీ రెగ్యులర్ డైట్‌‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండనిచ్చి కణాలన్నింటికి ప్రసరింపజేస్తుంది. రక్తం గడ్డకట్టకుండా, రక్తకణాలను నుండి ఎరరక్తకణాలను నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు లేదా కార్డియో వాస్కులార్ వ్యాధులు దారి తీయవచ్చు. గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది. 
 
అలాగే ఉల్లిపాయలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఉల్లిపాయలో ఉండే విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్, ముఖ్యంగా విటమిన్ సి, వ్యాధినిరోధకతను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వ్యాధులను , ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. అలాగే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. 
 
ముఖ్యంగా ఉల్లిపాయ ఒత్తిడిని తగ్గిస్తుంది.  ఉల్లిపాయల్లో ఉండే క్వార్సిటిన్ అనే అంశం నొప్పిని, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. కాబట్టి బాగా శ్రమించారనుకుంటే మీ ఆహారంతోపాటు ఒక చిన్న ముక్క పచ్చి ఉల్లిపాయను తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవారికి కూడా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలు క్యాన్సర్ కణాలను నశింపజేయటంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందింపజేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu