Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కివి ఫ్రూట్ హెల్త్ బెనిఫిట్స్: బేబీలలో నరాల జబ్బుల్ని దూరం చేస్తుందట!

Advertiesment
kiwi fruit nutrition facts health benefits
, శనివారం, 27 సెప్టెంబరు 2014 (17:05 IST)
కివి ఫ్రూట్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలా? అయితే స్టోరీ చదవండి. అరటిపండులో ఎంత పొటాషియం వుందో అంత కివి పండులో వుంది. అరటిపండుతో పోలిస్తే కేలరీలు కూడా ఈ పండులో తక్కువే. కేలరీలు తక్కువుండటంతో గుండెకు ప్రయోజనకరంగా సోడియం కూడా తక్కువే. సోడియం రక్తపోటు నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. 
 
కివి పండులో తక్కువ కొవ్వు శాతంతో విటమిన్ ఇ లభిస్తుంది. విటమిన్ ఇ అధిక యాంటీ ఆక్సిడంట్లను అందించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కివి పండులో ఫోలిక్ యాసిడ్ అధికం. గర్భవతి మహిళలు దీనిని తీసుకుంటే మంచి ప్రయోజనం. ఫోలిక్ యాసిడ్లు బేబీలలో నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. గర్భవతికి తగిన మోతాదులో విటమిన్లను కూడా అందిస్తుంది. బేబీ ఎదుగుదలలో మెదడు పెరిగేలా చేస్తుంది. గుండె జబ్బులనుండి రక్షిస్తుంది. 
 
ఇంకా కొన్ని రకాల కేన్సర్ రాకుండా రక్షిస్తుంది. రక్తంలో షుగర్ స్ధాయిలను తగ్గించి డయాబెటీస్ రాకుండా చేస్తుంది. బరువును తగ్గిస్తుంది.  అలాగే 'కివి' పండులో బత్తాయి, కమలా వంటి పండ్లలో కన్నా ఎక్కువగా 'సి' విటమిన్ వుంటుంది. దీని వలన శ్వాసక్రియ ఇబ్బందులు వంటివి దగ్గరికి చేరవు. ఇంకా ఈ పండులో పీచు పదార్దం కూడా ఎక్కువే, జీర్ణవ్యవస్థకు పీచు పదార్దం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu