అమ్మానాన్నలు ఉద్యోగాలు వెళ్లిపోతే చిన్నారుల ఆలనాపాలనా సాధారణంగా ఇంట్లో ఉండే పెద్దవాళ్లే చూసుకొంటారు. టీవీలకూ, నెట్‌కి అతుక్కుపోకుండా ఇలా పెద్దవాళ్ల సంరక్షణలో పెరగడం వల్ల పిల్లలకు చక్కటి మనోవికాసం కలుగుతుంది. మరి పెద్దల మాటకొస్తే..? వారికి కేవలం కాలక్షేపమైనా మరేదైనా ప్రయోజనం ఉందా అంటే సాధారణంగా ఆ వయసులో పెద్దలని ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఒంటరితనమూ బాధపెడుతుంది.
మెదడూ, శరీరభాగాలు సమన్వయం చేసుకొనే తీరు తగ్గుతూ ఉంటుంది. కానీ పిల్లల ఆటపాటల్లో వాళ్ల సంరక్షణలో మునిగే వారి విషయంలో ఈ సమన్వయం మందగించిదని తేలింది. ముఖ్యంగా పురుషుల్లో పోలిస్తే మహిళల విషయంలో ఈ సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.
2,300 మంది మహిళలపై చేసిన ఈ అధ్యయనాన్ని పరిశీలిస్తే వారంలో పదిగంటల పాటు పిల్లల్ని చూసుకునే వారిలో సగటున చురుకుదనం కనిపించింది. అదే ఒంటరిగా ఉండే పెద్దవారిలో పెద్దగా మార్పులేదు. చదువుకున్న అమ్మమ్మలు నాయనమ్మలూ పిల్లలకు పాఠాలు చెబుతూ, వారతో ఆడుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ సత్ఫలితాలు వస్తున్నాయని ఈ అధ్యయనం తెలిపింది.