Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజూ 37 స్ట్రాబెర్రీలు తినండి.. డాక్టర్లకు దూరంగా ఉండండి..!

Advertiesment
స్ట్రాబెర్రీస్
FILE
రోజూ 37 స్ట్రాబెర్రీలు తినండి.. డాక్టర్లకు దూరంగా ఉండండి అంటున్నారు న్యూట్రీషన్లు. రోజూ 37 స్ట్రాబెర్రీలు తింటే రోగాలకు దూరంగా ఉండవచ్చునని ఓ సర్వేలో తేలినట్లు న్యూరాలజిస్ట్‌లు చెబుతున్నారు. సాల్క్ ఇన్సిస్టిట్యూట్‌ జరిపిన బయోలజికల్ స్టడీస్‌లో ఈ విషయం తేలింది. ఎరుపాటి స్ట్రాబెర్రీలను రోజుకు 37ని సమయం దొరికినప్పుడల్లా అలా కొరుక్కుతింటే ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు.

వీటిలో బ్లూబెర్రీస్, రెడ్‌వైన్, ఫిస్టెన్ వంటివి ఉండటం వల్ల స్ట్రాబెర్రీలను తినాలని న్యూట్రీషన్లు చెపుతున్నారు. ఇతర కూరగాయలను తీసుకోవడం కంటే స్ట్రాబెర్రీలను రోజూకు 37 తినడం ద్వారా మధుమేహానికి, మెదడు సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. స్ట్రాబెర్రీలోని ఫిస్టిన్ నరాలను పటిష్ట పరచడంతో పాటు నరాల బలహీనతను దూరం చేస్తుంది.

ఇంకా హైబీపీ, అల్జీమెర్ వంటి వ్యాధులను స్ట్రాబెర్రీ తీసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. ఇంకా ఊబకాయం కూడా స్ట్రాబెర్రీ తినడం ద్వారా దూరమవుతుందని సెల్యూలర్ న్యూరోబయోలజీ లేబరటరీ ప్రొఫెసర్ డేవిడ్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu