Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాంసకృత్తులతోనే ఆరోగ్య పుష్టి

Advertiesment
మాంసకృత్తుల పుష్టి పౌష్టికాహారం వారోత్సవాలు పాలిచ్చే తల్లులకు బాలింతలకు

పుత్తా యర్రం రెడ్డి

ఆధునిక పోకడలకు పోతున్నా సగటు మనిషికి పౌష్టికాహారం అందడం చాలా కష్టంగానే ఉంది. గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు, పిల్లలకు ఇప్పటికీ పౌష్టికాహారం లభ్యం కావడంలేదు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వివిధ పథకాలను అమలులోకి తెచ్చింది.

ఆహార పదార్థాలలోని మాంసకృత్తుల
ఆహారపదార్థం(100 గ్రాములు)
గ్రాములలో
శెనగ, మినము, పెసర, కందిపప్పు
22
వేరుశెనగ, బాదం, జీడిపప్పులు
23
చేపలు
20
మాంసము
22
ఆవు పాలు
3.2
గేదె పాలు
4.3
కోడిగుడ్డు ( సుమారు 44 గ్రాములు)
13.3
సోయాబీన్స్
43.2
అంగనవాడి కేంద్రాల ద్వారా ఈ ఆహారాన్ని అందజేయడానికి శతవిధాల కృషి చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా జనాన్ని జాగృతం చేయడానికి చాలా ఆ శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మానవుని జీవితంలో ఈ పౌష్టికాహారం దొరకడం అంత కష్టమా? ఇందుకు ముందుగా పౌష్టికాహారం అంటే ఏమిటో తెలుసుకుంటే సరిపోతుంది.

ఇందులో ముఖ్యమైనవి మాంసకృత్తులు (ప్రోటీన్స్). శరీర సౌష్టవ నిర్మాణానికి ఇవి చాలా అవసరం. మాంసకృత్తులు కౌమారదశలో ఉన్న పిల్లల పెరుగుదలకు చాలా ఉపయోగకరం. పెద్దవయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా అవసరం. గర్భవతులు మాంసపుకృత్తులు తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డ ఆరోగ్య లోపాలతో జన్మిస్తారు. బాలింతలకు కూడా మాంసకృత్తులు అవసరం. తల్లి పాలు తాగే బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి .

మాంసకృత్తులు ఎంత తీసుకోవాలి.. ఎందులో లభిస్తాయి...
మాంసాహారులకు లభించే మాంసకృత్తులు, అధిక శాతం మరియు నాణ్యమైన అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది. శాఖాహారం తీసుకునే వారు వీటిని పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు ద్వారా పొందవచ్చు. నూనె గింజలు, పప్పులు, పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారైన పదార్థాలు ,జంతు మాంసము, చేపలు, కోడి మాంసం వంటి ఆహార పదార్థాలలో మాంసపుకృత్తులు అధికంగా లభిస్తాయి. వృక్షాహారంలో సొయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే 40% కన్నా ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి.

ఏ వయస్సులో ఎంతెంత?
పుట్టినప్పటి నుంచి చనిపోయే వరుకు మాంసకృత్తుల అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఎదుగుతున్న పిల్లలకు చాలా అవసరం ఉంది. 16-18 సంవత్సరాల మధ్య వయస్సు గల 57 కిలోల బరువు గల బాలురకు రోజుకు 78 గ్రా. అవసరం ఉంటుంది. ఇదే వయసులో ఉన్న 50 కిలోలల బరువు గల బాలికలు రోజుకు 63 గ్రా. తీసుకోవాల్సి ఉంటుంది. గర్బవతి ప్రతిరోజూ 65 గ్రాములు తీసుకోవాలి. పాలిచ్చే తల్లులకు/బాలింతలకు 6 నెలల వరకు ప్రతి రోజూ 75 గ్రా.తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu