Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నట్స్, బీన్స్, సీడ్స్ తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!!

Advertiesment
ఆరోగ్యం
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2012 (15:04 IST)
FILE
నట్స్, బీన్స్, సీడ్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చునని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. హృద్రోగ సమస్యలు, బరువు నియంత్రించాలనుకునే వారు ప్రతిరోజూ నట్స్, బీన్స్, తృణధాన్యాలు తీసుకోవడం చాలా మంచిదని వారు చెబుతున్నారు. కొవ్వు పదార్థాలు తక్కువగా కలిగిన బాదంపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్షలు వంటివి తీసుకోవడం ద్వారా గుండెపోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చును.

ఇంకా సైంటిఫిక్ రివ్యూ ప్రకారం అల్పాహారం తీసుకున్న తర్వాత రెండేసి బాదంపప్పులు తీసుకుంటే శరీరంలో గ్లూకోజ్ లెవల్‌ను సక్రమంగా ఉండేలా చేస్తుందని, నీరసంను దరిచేరనివ్వదని ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీస్ (ఐఎఫ్‌టీ)కి చెందిన ఫుడ్ టెక్నాలజీ మ్యాగజైన్ ఎడిటర్ లిండా మిలో తెలిపారు.

నట్స్ తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించడం, శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వు శాతం స్థాయిని సరిచేయవచ్చని మిలో అన్నారు. ఇంకా వాల్‌నట్స్ తీసుకోవడం గుండె, మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంతో పాటు క్యాన్సర్‌ వ్యాధికి చెక్ పెడుతుంది.

ఇక బీన్స్‌ కూడా బరువు నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని కార్బొహైడ్రేట్లు, విటమిన్స్, ఫైబర్, మినరల్స్ శరీరాన్ని నాజూగ్గా చేయడంతో పాటు అల్జీమర్ వంటి చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే ప్రతిరోజూ గుప్పెడు తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా వాటిలోని అమినో యాసిడ్స్ గాయాల నుంచి కోలుకునేలా చేయడంతో పాటు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu