ధూమపానం కారణంగా శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ధూమపానం కారణంగా శ్వాసకోశాల సామర్థ్యాన్ని తీవ్రస్థాయిలో హరించి వేస్తుందన్నది కఠోరనిజం. అందులో నిజం ఎంతుందే తెలుసుకోవాలంటే చదవండి మరి...
ఎంత శాతం.. ఉచ్వాసనిశ్వాసల ఆధారంగా శ్వాసకోశాల సామర్థ్యాన్ని గుర్తిస్తారు. సాధారణంగా 40 ఏళ్లు దాటాక సగటు మనిషి శ్వాసకోశాల సామర్థ్యం 30 మిల్లీలీటర్‌ల సామర్థ్యం మేర తగ్గిపోతుండగా, పొగ తాగే వారిలో మాత్రం అది వయసుతో పనిలేకుండా అదనంగా 45 మిల్లీలీటర్‌లకు పడిపోతున్నట్లు డాక్టర్‌లు చెబుతున్నారు. దీని వల్ల శరీరంలో ఆక్సీజన్ పరిమాణం క్షీణించిపోతుంది. రక్తం ద్వారా మెదడుకు, గుండెకు అందాల్సిన ఆక్సీజన్ అందక మరి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
నివారణ... మరో విషయం ధూమపానం సేవించే వారి కారణంగా ఆ పొగను గాలిలో వదలడం ద్వారా ఇతరులకు కూడా ఇలాంటి సమస్య ఎదురు కావచ్చని డాక్టర్‌లు హెచ్చరిస్తున్నారు. ధూమపానం సేవించే వారు, ఆ అలవాటును నిదానంగా ఆపివేయగలిగితే తరిగిపోతున్న శ్వాసకోశాల సామర్థ్యాన్ని అడ్డుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ధూమపాన స్వీకరణ ద్వారా శరీరంలో పొగలోని విషపదార్థాలు శ్వాసకోశాలనే కాక, పెదాలు, నాలుక, గొంతు తదితర శరీర భాగాలను కూడా దెబ్బతీస్తుందని వారు చెబుతున్నారు.