Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెల్ల జుట్టు నల్లగా మారాలంటే........

Advertiesment
తెల్ల జుట్టు
, గురువారం, 5 ఏప్రియల్ 2012 (18:25 IST)
File
FILE
జుట్టు నల్లగా ఉంటేనే అందం. జుట్టు తెల్లబడడం మొదలు పెడితే నేటి యువత మానసికంగా కృంగిపోతున్నారు. మన జుట్టు రంగు చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. మన వెంట్రుకల క్రిందిభాగంలో ఉండే మెలానో సైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. మన శరీరంలోని మెలానిన్ స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగులు ఏర్పడతాయి. వయసు పైబడుతున్నప్పుడు మెలానిన్ ఉత్పత్తి తగ్గిపోయి క్రమంగా ఆగిపోతుంది. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది. వయసు వల్ల నెరసిన జుట్టు ఇక నల్లబడదు. తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చలేము. కానీ, యుక్త వయసులో జుట్టు తెల్లబడితే అంటే బాల నెరుపు వస్తే దాన్ని నివారించవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు.

బాలనెరుపు నివారణ:

గోరింటాకు, మందార ఆకు, కరివేపాకు ఈ మూడింటినీ సమ పాళ్ళలో కలిపి బాగా రుబ్బి తలకు రాసి ఆరేవరకూ ఉంచి తలస్నానం చేస్తూ ఉంటే క్రమంగా బాల నెరుపు పోయి, జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. అదేవిధంగా కరివేపాకు, గుంటగలగరాకు, పొన్నగంటి కూర ఈ మూడింటినీ కలిపి రుబ్బి తలకు రాసి ఆరిన తర్వాత స్నానం చెయ్యాలి. ఈ మిశ్రమాలతో పాటు నేల ఉసిరిని కూడా కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని కుదుళ్ళలోకి ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.

ఆహార ఔషధం:

కరివేపాకును రోజూ ఆహారంలో అంటే, పప్పుచారులోనూ, తాలింపులోనూ, పచ్చడిగానూ, కారప్పొడిగానూ చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకుని పచ్చిగానే రుబ్బి తీసుకుంటే ( తింటే ) పూర్తి ఫలితం ఉంటుంది. కరివేపాకును ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu