Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరునవ్వుతో మీ వయసును తగ్గించుకోండి

Advertiesment
చిరునవ్వు
, సోమవారం, 14 డిశెంబరు 2009 (14:35 IST)
FILE
వయసు పెరిగే కొద్దీ మీ ముఖంలో మార్పులు వస్తుంటాయి. దీంతోపాటు ముఖంపై ముడతలు ఏర్పడుతుంటాయి. వీటిని నివారించేందుకు నిత్యం చిరునవ్వుతో ఆనందంగా ఉంటే మీ వయసు అంతంగా తెలియదంటున్నారు పరిశోధకులు.

మీ భావాలను వ్యక్తీకరించడంతోపాటు, నిత్యం చిరునవ్వును చిందిస్తుంటే మీరు అందంగా కనపడుతుంటారని పరిశోధకులు తెలిపారు. నవ్వు ముఖానికి మంచి వ్యాయామంలాంటిది. నవ్వడం వలన ముఖంలోని కండరాలు ముడతపడకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ముఖం మరింత అందంగా కనపడాలంటే మీరు నిత్యం చిరునవ్వును చిందిస్తుండాలి. అలాగే వీలు చిక్కినప్పుడు కాస్త బిగ్గరగా నవ్వుతుండండి. దీంతో ముఖానికి మంచి వ్యాయామం కలుగుతుందంటున్నారు పరిశోధకులు.

ప్రతి రోజు నవ్వును ఓ వ్యాయామంలా చేస్తుండండి. నవ్వుకు సంబంధించిన వ్యాయామాన్ని చేయాలనుకుంటే మీ పెదాలి చివరి భాగాన్ని మెల్లగా సాగదీయండి. ప్రతి రెండు సెకన్లకు ఓసారి మీ పెదాలను కాస్త వెడల్పు చేయండి. ఇలా చేస్తున్నప్పుడు మీ క్రింది పెదిమ, గడ్డంను కాస్త స్ట్రెచ్ చేయండి. ఉదాహరణకు "ఈ" అక్షరాన్ని పలికినట్లు నవ్వడం ప్రారంభించండి. ఇలా కనీసం ఆరు సార్లు చేయండి.
webdunia
FILE


కాసేపయ్యాక మీ పెదాలను కుడి వైపుకు తిప్పండి. అలాగే ఎడమ వైపుకు తిప్పండి. ఇలా ఆరుసార్లు చేయండి. తర్వాత యధావిధిగా చిరునవ్వును చిందించండి. దీంతో ముఖంపైనున్న చర్మానికి కాస్త వ్యాయామం అందించినవారవుతారు.

ముఖానికి మీరు చేసే వ్యాయామంతోపాటు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతి రోజు నవ్వడం వలన మీ మనసుకు ఏకాగ్రత కలుగుతుంది. దీంతో మీకు తెలియకుండానే మీలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అలాగే మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. అలాగే నిత్య యవ్వనులుగాను కనపడతారంటున్నారు పరిశోధకులు.

Share this Story:

Follow Webdunia telugu