సాధారణంగా గ్రామీణ ప్రాంత యువకులు ఉల్లిపాయలను ఎక్కువగా ఆరగిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. ఉల్లిపాయలు తింటే.. తమలో కామవాంఛ పెరుగుందనే భావన ఉంది. అందుకే వీటిని ఎక్కువగా తింటుంటారు. ఈ వాదనను సెక్స్ నిపుణులు సైతం కొట్టిపారేయలేక పోతున్నారు. యువకుల్లో విపరీతమైన సెక్స్ వాంఛలకు పెద్ద ఉల్లిపాయలే కారణమంటున్నారు. అందువల్లనే కొంత మంది ఉల్లిపాయలను ఆరగించేందుకు దూరంగా ఉంటారని, మరికొందరు వీటిని ఎక్కువగా తింటుంటారని చెపుతారు.
సాధారణంగా యువతీయువకుల్లో వయస్సులో పుట్టే అలజడి, వయస్సు ప్రభావం తదితర అంశాలను బట్టి సెక్స్ కోరికలు ఆధారపడి ఉంటాయంటున్నారు. కొందరు 24 గంటలూ సెక్స్ కోరికలతోనే కాలం గడుపుతారనీ, అటువంటివారు క్రమంగా వారి దృష్టిని మరో అంశంపైకి మరల్చే యత్నం చేయాలంటున్నారు.
సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండే వారిని వారికి ఇష్టమైన పనులు చేయించడం వల్ల సెక్స్ కోర్కెలకు అడ్డుకట్ట వేయవచ్చని వైద్యులు చెపుతున్నారు. విద్యార్థులైతే చదువుకునే సమయంలో ఒంటరిగా కాక నలుగురిలో కూర్చుని చదివించేలా చేయాలని సెక్స్ నిపుణులు కోరుతున్నారు.