Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాయలసీమ రతనాల చరిత్ర... ఇవిగోండి....

రాయలసీమ రతనాల చరిత్ర... ఇవిగోండి....
, గురువారం, 17 మార్చి 2016 (20:25 IST)
రాయలసీమ అంటే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలాగా ఫ్యాక్షన్‌, హత్యలు, రాళ్ళు, రప్పలు, కరువు మాత్రమే కాదు. రాయలసీమ జిల్లాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేని కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. అయితే ఇవేవీ తెలియని కొంతమంది రాయలసీమ గురించి ఎప్పుడు ఫ్యాక్షన్‌ తరహాలోనే సినిమాలు తీస్తుంటారు. రాయలసీమ జిల్లాలో కొన్ని నమ్మలేని నిజాలు చూడండి.. మీరే నోటి మీద వేలేసుకుంటారు...
 
ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఎర్రచందనం పెరిగే ఏకైక ప్రాంతం - దక్షిణ నల్లమల, శేషాచల అడువులు- ఇవి పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం.
కలివికోడి - భారతదేశంలోని పక్షులలో ఒకటైన కలివికోడి చివరి ఆవాసం కడపజిల్లా లంకమల అభయారణ్యం (ప్రపంచంలోనే ఈ కలివికోడి ఇక్కడ తప్ప ఎక్కడా లేవు).
ప్రపంచంలోనే అతిపెద్ద బైరటీస్‌ నిల్వలు ఉన్న ప్రాంతం - కడప జిల్లా మంగంపేట గనులు.
ఆంధ్రలో మానవుని నాగరికత కర్నూల్‌ - కడప జిల్లాలో మొదటై ఉత్తరాదికి వ్యాపించింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రపంచంలోనే రెండవ ధనిక ఆలయం.
 
రాయలసీమలో ఒక జ్యోతిర్లింగం (శ్రీశైలం మల్లిఖార్జున స్వామి) ఒక పంచభూత లింగం, (శ్రీకాళహస్తి - వాయులింగం) అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి (శ్రీశైలం భ్రమరాంబిక), నవనారసింహం క్షేత్రాలలో రెండు (కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు అహోబిలం నరసింహస్వామి) ఉన్నాయి.
 
ప్రపంచంలోనే అతి పురాతన లింగం (మొట్టమొదటి లింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో బయటపడింది)
 
తెలుగు భాష మొదటి శాసనం - కడప జిల్లా కలమళ్ళ శాసనం.
 
మన జాతీయగీతం మదనపల్లిలో రాయబడింది.
 
తెలుగులో మొదటి కవయిత్రి మన తాళ్ళపాక తిమ్మక్క.
 
దేశంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వు - శ్రీశైలం టైగర్‌ రిజర్వ్.
 
కదిరి దగ్గరి తిమ్మమ్మ మర్రిమాను దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద చెట్టు.
 
తెలుగు సినిమా పుట్టినిల్లు కడప జిల్లా సురభి గ్రామం.
 
ప్రధమ స్వాతంత్ర్య పోరాటానికంటే ముందే బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వారు.
 
కర్నూలు జిల్లా బెలుం గుహలు దేశం లోనే రెండవ అతిపెద్ద గుహ సముదాయంగా పేరు గాంచినవి.
 
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద జిల్లా మన అనంతపురం జిల్లా.
 
ఇంకా ఇంకా రాయలసీమ అంటే వేమన పద్యం, అన్నమయ్య కీర్తన, మొల్ల రామాయణం, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం, కన్నప్ప భక్తి, అష్టదిగ్గజ వైభవం, రాయల రాజసం, బుడ్డా వెంగలరెడ్డి దాతృత్వం, తరిగొండ వెంగమాంబ భక్తి, గడియారం వెంకటేశ శాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు సాహిత్యం, లక్కోజు సంజీవ రాయశర్మ మేధస్సు, జిడ్డు క్రిష్ణమూర్తి తత్వం.

Share this Story:

Follow Webdunia telugu