Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాంతమూర్తి జాతిపిత ఉగ్రులైన ఆ రోజు...!

Advertiesment
బాలప్రపంచం
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ... బాపూజీ, గాంధీజీ, మహాత్మాగాంధీ, మహాత్ముడు, జాతిపిత... ఇలా పలురకాల పేర్లతో పిలువబడటం మనందరికీ తెలిసిందే. తెల్లదొరల పాలనలో మగ్గుతున్న భారతమాత దాస్య శృంఖలాలను బద్ధలుకొట్టిన మన పూజ్య బాపూజీ 1893, జూన్ 7వ తేదీన "మొట్టమొదటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని" చేపట్టిన సందర్భాన్నే... చరిత్రలో జూన్ 7వ తేదీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

స్వాతంత్ర్యోద్యమ కాలంలో బాపూజీ చేపట్టిన "సహాయ నిరాకరణ" ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే... ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది గానీ 1922‌లో ఉత్తరప్రదేశ్ చౌరీచౌరా‌లో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగింది. దీంతో ఉద్యమం అదుపు తప్పుతోందని గ్రహించిన గాంధీజీ దాన్ని వెంటనే నిలిపివేశారు.

అదలా ఉంచితే.. యావద్భారత ప్రజలచేతే కాకుండా, ప్రపంచ ప్రజలందరిచేతా గౌరవింపబడే మన గాంధీజీ 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించారు. పోర్‌బందర్‌లోను, రాజ్‌కోట్‌లోను విద్యనభ్యసించిన గాంధీజీ, 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్రం చదువుకునేందుకు ఇంగ్లండు వెళ్ళారు.

"అహింస" "హింస"కు బలయిన వేళ
  గాంధీజీ 1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్ధనా సమావేశానికి వెళ్తుండగా... నాథూరామ్ గాడ్సే అనే అతను కాల్చి చంపాడు. జీవితమంతా "అహింసా" పోరాట నినాదంతో గడిపిన మహాత్ముడు ఓ దుర్మార్గుడి "హింస"కు ఈ రకంగా బలైపోతూ "హేరామ్" అంటూ నేలకొరిగారు.      
ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి. 1891లో గాంధీజీ పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చారు. బొంబాయి‌లోను, రాజ్‌కోట్‌లోను ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్‌లో ఒక లా కంపెనీలో ఓ ఏడాది పనిచేసేందుకు కాంట్రాక్టు లభించింది.

అలా వెళ్ళిన గాంధీజీ, దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపారు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైల్లోంచి నెట్టివేయబడడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం లాంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నారు.

ఇలాంటి పరిస్థితులన్నీ గాంధీజీలో నాయకత్వ పటిమను పెంచడమేగాక, ఆయన ఆలోచనా సరళి పరిపక్వమై, రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికి దోహదపడ్డాయి. ఒక విధంగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. ఈ క్రమంలో భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించారు.

సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వంపై నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన పోరాటాలను చేసిన మహాత్ముడు.. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి చేసిన సత్యాగ్రహ పోరాటం 7 సంవత్సరాలపాటు ఏకధాటిగా సాగింది. ఈ క్రమంలోనే వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారు. కష్టనష్టాలకు తట్టుకొని గట్టిగా నిలబడ్డారు.

కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటిన, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. జాతిపితగా వేనోళ్ల కీర్తింపబడ్డ ఆయన... ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సాధించిపెట్టారు.

ఆ తరువాత... గాంధీజీ 1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్ధనా సమావేశానికి వెళ్తుండగా... నాథూరామ్ గాడ్సే అనే అతను కాల్చి చంపాడు. జీవితమంతా "అహింసా" పోరాట నినాదంతో గడిపిన మహాత్ముడు ఓ దుర్మార్గుడి "హింస"కు ఈ రకంగా బలైపోతూ "హేరామ్" అంటూ నేలకొరిగిపోయారు.

గాంధీజీని కాల్చిచంపిన హంతకుడు, నాథూరామ్ హత్యా స్థలంనుండి పారిపోయే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. పోలీసులు అతడిని నిర్భంధించి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. గాంధీజీ హత్యపై అనేక న్యాయస్థానాలలో విచారణ జరిగిన అనంతరం నాథూరామ్ గాడ్సే, అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలు.. 1949 నవంబరు 15న ఉరితీయబడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu