Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"గ్లోబల్ వార్మింగ్" అంటే ఏమిటి?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ కిరణాలు గ్లోబల్ వార్మింగ్ రక్షణ కవచం ఓజోన్ పొర
, మంగళవారం, 16 సెప్టెంబరు 2008 (13:50 IST)
FileFILE
భూమి చుట్టూ అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తోన్న ఓజోన్ పొర, గ్రీన్ హౌస్ వాయువుల వల్ల తరిగి పోతోంది. దీనినే "గ్లోబల్ వార్మింగ్" లేదా "భూమి వేడెక్కడం" అని అంటారు.

నీటిఆవిరి, కార్బన్‌డైయాక్సైడ్, మీథేన్ లాంటి కొన్ని రకాల వాయువులను "గ్రీన్ హౌస్ వాయువులు" అని పిలుస్తారు. ఇవి ప్రకృతి సహజంగా విడుదలైనప్పుడు భూమిపైన ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు ఉత్పన్నం చేసే రేడియో ధార్మికతను తగ్గించి ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు సాయం చేస్తాయి.

అయితే... శిలాజ ఇంధనాల వినియోగం అంటే... పెట్రో ఉత్పత్తుల వినియోగం ద్వారా అవసరాన్ని మించి అధికమొత్తంలో విడుదలయ్యే గ్రీన్‌హౌస్ వాయువులు భూగోళంపై ఉష్ణోగ్రతలను విపరీతంగా పెంచేస్తాయి. దీంతో భూమి విపరీతంగా వేడెక్కిపోతోంది.
భూమిని కాపాడాల్సింది మనమే..!
  ఏది ఏమైనప్పటికీ భూమి క్రమంగా వేడెక్కుతోందనే విషయం మాత్రం కాదనలేని సత్యం. మన శరీరాన్ని కాపాడుకోవటం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, ప్రాణాధారమైన మన గ్రహాన్ని నివాసయోగ్యంగా ఉంచుకోవడమూ అంతే ముఖ్యం కాబట్టి.. మన భూమిని రక్షించుకుందాం..!      


ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళి అనేక దుష్పరిణామాలను ఎదుర్కొంటోంది. హిమాలయాల్లో హిమానీనదాలు రికార్డు స్థాయిలో కుంచించుకు పోతున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే... 2035 నాటికల్లా తూర్పు మధ్య హిమాలయాల్లో హిమానీ నదాలే కనిపించవట.

ఆహార, నీటి సంక్షోభాలను ఎదుర్కోవడమే గాకుండా, వేసవి వడగాల్పుల వల్ల వేలాదిమంది అసువులు బాయాల్సి వస్తుంది. సముద్ర నీటి మట్టాలు పెరిగిపోవడం, అడవులు మునిగిపోవడం, కరవు పరిస్థితులు లాంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఏది ఏమైనప్పటికీ భూమి క్రమంగా వేడెక్కుతోందనే విషయం మాత్రం కాదనలేని సత్యం. మన శరీరాన్ని కాపాడుకోవటం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, ప్రాణాధారమైన మన గ్రహాన్ని నివాసయోగ్యంగా ఉంచుకోవడమూ అంతే ముఖ్యం కాబట్టి.. పర్యావరణాన్ని కాపాడుకుందాం. మన భూమిని రక్షించుకుందాం..!

Share this Story:

Follow Webdunia telugu