Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎడారి ఓడ అంటే...?

Advertiesment
ఎడారి ఓడ అంటే...? అచ్చతెలుగు భాష లొట్టిపిట్ట శరీరం మందం కంటిరెప్పలు
, శనివారం, 19 జులై 2008 (15:29 IST)
ఒంటెను ఎడారి ఓడ అంటారు. దీనినే అచ్చతెలుగు భాషలో లొట్టిపిట్ట అని అంటారు. వీటి శరీరం మందంగా ఉండటం వల్ల ఎడారి జీవనానికి సహకరిస్తుంది. అలాగే, వీటి పాదాలు పెద్దగా దిళ్ళలాగా ఉండటం వల్ల ఇసుకలో పాదం దిగబడకుండా వేగంగా పరిగెత్తేందుకు వీలవుతుంది.

ఈ ఒంటెలకు కంటి రెప్పలు పొడవుగా ఉంటాయి. కంటిరెప్పలు అలా ఉండటంవల్ల ఎడారుల్లో వచ్చే వడగాలుల సందర్భంగా ఇసుకను కంటిలో పడకుండా కాపాడతాయి. వీటికి తిండి తక్కువైనప్పటికీ, నీటితో ఎక్కువ రోజులు బ్రతుకుతాయి. తమ కడుపులోకి ఒక్కసారిగా ఎక్కువ నీటిని తీసుకునే ఈ ఒంటెలు కొద్దిరోజులదాకా నీటిని తీసుకోకుండానే బ్రతకగలవు కూడా.

వీటి శరీర ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 41 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటుంది. సౌదీ అరేబియాలో నివసించే ఒంటెల వీపులోనే సుమారుగా 50 కేజీల దాకా కొవ్వు ఉంటుందట. వీటి మాంసం గల్ఫ్ తదితర దేశాలలో విరివిగా వాడుతారు. ఎడారులలో నివసించే ప్రజానీకం వీటి పాలు పితికి త్రాగుతారు, ఇతర ఆహార పదార్థాలలో కూడా పాలను వినియోగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu