Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఋతువులు, కాలాలు ఎన్ని..?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ పిల్లలు ఋతువులు కాలాలు సంవత్సరం ఆరు మూడు వసంత గ్రీష్మ హేమంత శరత్ శిశిర వేసవి
, శనివారం, 11 అక్టోబరు 2008 (13:45 IST)
PTI PhotoPTI
పిల్లలూ...! ఒక సంవత్సరానికి ఋతువులు, కాలాలు ఎన్నో మీకు తెలుసా..? ఒక సంవత్సరానికి ఋతువులు ఆరు కాగా... కాలాలు మూడు.

ఇప్పుడు ఋతువుల పేర్లేంటో చూద్దామా...!
మొదటిది... వసంత ఋతువు
రెండవది... గ్రీష్మ ఋతువు
మూడవది... వర్ష ఋతువు
నాల్గవది... శరత్ ఋతువు
ఐదవది... హేమంత ఋతువు
ఆరవది... శిశర ఋతువు

అలాగే కాలాల విషయానికొస్తే...
మొదటిది.. వేసవి కాలం
రెండవది... వర్షాకాలం
మూడవది... శీతాకాలం

ఋతువులు ఏయే నెలల్లో, ఏయే రుతువులు వస్తాయంటే...
చైత్ర,, వైశాఖ మాసాలు... వసంత ఋతువు
జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు... గ్రీష్మ ఋతువు
శ్రావణ, భాద్రపద మాసాలు... వర్ష ఋతువు
ఆశ్వయుజ, కార్తీక మాసాలు... శరత్ ఋతువు
మార్గశిర, పుష్య మాసాలు... హేమంత ఋతువు
మాఘం, ఫాల్గుణం మాసాలు... శిశిర ఋతువు

అలాగే ఏయే కాలాల్లో ఏయే నెలలు వస్తాయంటే...
చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు... వేసవి కాలం
శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు... వర్షా కాలం
మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు... శీతా కాలం

Share this Story:

Follow Webdunia telugu