Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అశోక చక్రం'లోని 24 ఆకుల భావాలు..!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ జాతీయ పతాకం అశోక చక్రం ధర్మ ఆకులు మౌర్య సామ్రాజ్యం అశోక చక్రవర్తి సాంచి సారనాథ్
, గురువారం, 11 సెప్టెంబరు 2008 (12:44 IST)
WD PhotoWD
పిల్లలూ...! మన జాతీయ పతాకం మధ్యలో ఉండే అశోక చక్రం గురించి మీకు తెలిసే ఉంటుంది. అది ఒక ధర్మ చక్రం. దానికి 24 ఆకులు (స్పోక్స్) ఉంటాయి. మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి పరిపాలనా కాలంలో తన రాజధాని అయిన సారనాథ్‌లోని అశోక స్తంభంలో ఈ ధర్మ చక్రాన్ని ఉపయోగించాడు.

ధర్మానికి గుర్తుగా, మన జాతీయ పతాకంలో 1947వ సంవత్సరం జూలై 22వ తేదీన ఈ అశోక చక్రం చోటు చేసుకుంది. ఇది తెల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో నీలి, ఊదారంగులు కలగలసి ఉంటుంది. ఈ అశోక చక్రంలో "చక్ర" అనేది సంస్కృత పదం కాగా... స్వయంగా తిరిగుతూ, కాల చక్రంలాగా తన చలనాన్ని పూర్తిచేసి, మళ్లీ తన గమనాన్ని ప్రారంభించేంది అని దాని అర్థం.

పై సంగతలా కాసేపు పక్కనబెడితే... ఈ అశోక చక్రంలో ఉన్న 24 ఆకులకు తగిన భావాలున్నాయి. అవి ఏవంటే... ప్రేమ, ధైర్యం, సహనం, శాంతి, కరుణ, మంచి, విశ్వాసం, హుందాతనం, సంయమనం, లాభాపేక్ష లేకుండటం, త్యాగనిరతి, నిజాయితీ, ఖచ్చితత్వం, న్యాయం, దయ, ఆహ్లాదం, ఆర్ద్రత, ధర్మాధర్మ విచక్షణ, జాలి, భగవంతునిపట్ల ఎరుక, ఈశ్వర జ్ఞానం, నైతికత, పాపభీతి, భగవంతునిపట్ల శ్రద్ధ, ఆసక్తి, భక్తి విశ్వాసాలు మొదలైనవి.

Share this Story:

Follow Webdunia telugu