ఫిఫా వరల్డ్ కప్ : నేడు పోర్చుగల్-స్పెయిన్ ఢీ.. అందరి కళ్లూ అతనిపైనే...
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2018 మెగా టోర్నీలో భాగంగా రెండో రోజైన శుక్రవారం పోర్చుగల్, స్పెయిన్ దేశాలకు చెందిన జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితం సంగతి అటుంచితే.. అందరి కళ్
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2018 మెగా టోర్నీలో భాగంగా రెండో రోజైన శుక్రవారం పోర్చుగల్, స్పెయిన్ దేశాలకు చెందిన జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితం సంగతి అటుంచితే.. అందరి కళ్లు మాత్రం పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై కేంద్రీకృతమైవున్నాయి.
గురువారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా జట్టుపై ఆతిథ్య రష్యా 5-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-బిలో భాగంగా జరిగే పోరులో యూరోపియన్ చాంపియన్ పోర్చుగల్-స్పెయిన్ తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో ప్రధాన ఆకర్షణకానున్నాడు. అద్భుత కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నా... 33 ఏళ్ల రొనాల్డోను ఫిఫా కప్ ఊరిస్తుండటంతో ఈసారి జట్టుకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించి తన కెరీర్‌కు స్వస్తిచెప్పాలని భావిస్తున్నాడు. దాంతో ఫుట్‌బాల్ అభిమానులు అతడి చేసే విన్యాసాలను తిలకించాలని ఎదురు చూస్తున్నారు.