Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉగాది రోజున శ్రీరాముడిని పూజించి.. పసుపు రంగు పుష్పాలు వాడితే..!?

Advertiesment
ఉగాది రోజున శ్రీరాముడిని పూజించి.. పసుపు రంగు పుష్పాలు వాడితే..!?
, శుక్రవారం, 20 మార్చి 2015 (16:32 IST)
ఉగాది రోజున తెల్లవారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు పూజ చేయడం మంచిది. ఉగాది మనకు సంవత్సరాది. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తానలేచి, అభ్యంగన స్నానం చేయడం అతిముఖ్యమైన విధి. ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులూ దేవిని ఆరాధిస్తారు. అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణ, భగవత్పూజ పంచాగ శ్రవణం, ఉగాది పచ్చడి భక్షణం మంచిది.
 
అలాగే ఉగాది రోజున అభ్యంగన స్నానానికి అనంతరం పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. మీకు నచ్చిన లేదా ఇష్టదేవతా పూజ చేసుకోవచ్చు. పూజకు ఉగాది పచ్చడి నైవేద్యం, పసుపు రంగులు పుష్పాలు వాడాలి. ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు పూజ చేయవచ్చు. దీపారాధనకు రెండు ప్లస్ రెండు దూది వత్తులు, ఆవునెయ్యి వాడాలి. 
 
అలాగే ఉగాది నాడు ఇంతకుముందు చూడని పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది. ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవములు నిర్వహించడం, లేదా మీ శక్తి చేయించగలిగే పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. 
 
ఇంకా ఆలయాల్లో పంచాంగ శ్రవణం వినండి. అలాగే ఆలయాల్లో వసంతనవరాత్ర ఉత్సవాలు జరిపించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గోచార ఫలితాలపై ఉపన్యాసాలు ఇప్పించడం మంచిది. ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పంచహారతి ఇవ్వడం, నుదుటన కుంకుమ ధరించాలి. ఇంకా ఉగాది నాడు శ్రీరాముడిని స్మరిస్తే శుభఫలితాలుంటాయి. అందుచేత శ్రీరామ మంత్రాన్ని 108 సార్లు పూజ చేసేటప్పుడు పఠించాలి.

Share this Story:

Follow Webdunia telugu