Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్షయ తృతీయ రోజున వర్జ్యం, రాహుకాలంతో పనిలేదు..

అక్షయ తృతీయ రోజున వర్జ్యం, రాహుకాలంతో పనిలేదు..
, మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (13:31 IST)
''వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతా
దుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా''
 
మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది.
 
పుణ్యకార్యాచరణతోవచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు. 
 
ఇంకా గృహ నిర్మాణం, ఇంటిస్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయనాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసినా సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-04-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధిస్తే...