Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"షడ్రుచుల" సమ్మేళనం ఉగాది పచ్చడి

Advertiesment
ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. మామిడాకుల
FileFILE
ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. మామిడాకుల తోరణాలు, రంగురంగుల ముగ్గులు, పిల్లల అల్లరి చేష్టలు, పనుల మధ్య పెద్దల హడావుడి, కొత్త బట్టలతో అనేక మంది ఇళ్లు కళకళలాడుతుంటాయి. పల్లెల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఉగాది పండుగ రోజు నుంచి శ్రీరామనవమి వరకు ఏడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఉగాది పచ్చడి...
ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో... ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణులు కూడా సూచిస్తున్నారు.

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రకాల రుచులు కలపి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. కొత్తసహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను, ఆనందవిషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం.

ఈ పచ్చడి తయారీ చేయడం కోసం చెరకు, మామిడి పిందెలు, అరటి పళ్ళు, చింతపండు, వేప పువ్వు, బెల్లం, జామకాయలు మొదలగునవి వాడుతుండటం ఆనవాయితీ.

Share this Story:

Follow Webdunia telugu