Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డైనింగ్ గది అలంకరణే అతిథులకు సంపూర్ణ విందు!

డైనింగ్ గది అలంకరణే  అతిథులకు సంపూర్ణ విందు!
, మంగళవారం, 1 జులై 2014 (17:27 IST)
మనిషి ఆహారాన్ని తీసుకునేది కేవలం బతకడం కోసమే కాదని, మనిషి జీవన గమనంలో ఆహారం తీసుకోవడం ఒకటని, కొన్ని సందర్భాల్లో మనిషి బతుకంతా ఆ భోజనం చుట్టూనే పరిభ్రమిస్తుందని పేర్కొంటారు. ముఖ్యంగా మనిషి చేసే కోటి విద్యలు కూటి కోసమే అని నానుడూ ఉంది. అందమైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ భోజనం చేయడం ఓ కళ. కొందరు భోజనం చేస్తుంటే ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది. మరికొందరు అన్నం తింటుంటే చూడముచ్చటగా ఉంటుంది. 
 
అయితే ఇందుకోసం వంట చేసే ప్రదేశం కన్నా భోజనం చేసే ప్రదేశాలు తీపి గుర్తుగా మిగిలి పోతుంటాయి. నేటి ఆధునిక ప్రపంచంలో భోజన చేసే ప్రదేశాల నిర్మాణానికి ఎంతో ఖర్చు చేయడమే కాకుండా.. చూసిన వెంటనే ఆకర్షించే విధంగా రూపొందింస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు అనుకూలంగా, అతిథిలుకు తీపి జ్ఞాపకంగా ఉండేందుకు డైనింగ్ హాల్‌ను ఏవిధంగా రూపొందించుకోవాలో ఫెంగ్‌షుయ్‌ శాస్త్రం స్పష్టంగా పేర్కొంది. ఎపుడైనా డైనింగ్ హాల్ వంట గదికి సమీపంలో ఉండేలా చూసుకోవాలి. 
 
ముఖ్యంగా కిచెన్ రూంకు తూర్పు దిశలో ఉంటే బాగుంటుంది. ఇంటి ప్రధాన ద్వారానికి సమీపంలో ఉండకూడదు. ఇలా ఉన్నట్టయితే పిల్లల ధ్యాస ఆటల మీదకు మరలుతుంది. అందువల్ల వారు చదువుల పట్ల నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. డైనింగ్ హాల్ బాత్‌రూం లేదా టాయ్‌లెట్‌కు సమీపంలో చేసుకోరాదు. అలాగే మెట్లకింద గానీ, మెట్లకు ఎదురుగా గానీ భోజన గదిని ఏర్పాటు చేసుకోరాదు. 
 
ఈ గదిలో మితిమీరిన ఫర్నీచర్ కూడా ఉంచకూడదు. ఎక్కువగా ఉంటే భోజనం చేసే అతిధులు దృష్టి ఫర్నీచర్‌పై మరలి, భోజనంపై ఆసక్తి తగ్గుతుంది. అలాగే గదిలో ఉంచాల్సింన డైనింగ్ టేబుల్ ఆకారం, సైజు, కుర్చీల సంఖ్యను ఫెంగ్‌షుయ్‌ వివరించింది. ఈ టేబుల్ గుండ్రంగా లేదా కోడిగ్రుడ్డు ఆకారంలో ఉండేలా చూసుకుంటే శ్రేయస్కరం. 
 
అలాగే డైనింగ్ టేబుల్‌కు నాలుగు కోణాలు కన్నా ఎనిమిది కోణాలు ఉండేలా చూసుకోవడం మంచిది. అలాగే భోజన గదిలో అందమైన, ఆకర్షణీయమైన పెయింట్‌ను వేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల అతిధులకు మంచి విందును ఇచ్చినట్టు అవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu