Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శీతాకాలం.. సాయంత్రం పూట హాట్ చికెన్ సూప్ తాగితే?

అసలే శీతాకాలం హాట్ హాట్‌గా ఏదైనా సూప్ తాగాలనిపిస్తే.. వెంటనే చికెన్ సూప్ ట్రై చేయండి. శీతాకాలంలో అటాక్ అయ్యే అలర్జీలకు ఇది చెక్ పెడుతుంది. సోడియం తక్కువగా కలిగిన చికెన్ సూప్‌ ద్వారా గొంతు నొప్పిని దూర

శీతాకాలం.. సాయంత్రం పూట హాట్ చికెన్ సూప్ తాగితే?
, బుధవారం, 7 డిశెంబరు 2016 (15:34 IST)
అసలే శీతాకాలం హాట్ హాట్‌గా ఏదైనా సూప్ తాగాలనిపిస్తే.. వెంటనే చికెన్ సూప్ ట్రై చేయండి. శీతాకాలంలో అటాక్ అయ్యే అలర్జీలకు ఇది చెక్ పెడుతుంది. సోడియం తక్కువగా కలిగిన చికెన్ సూప్‌ ద్వారా గొంతు నొప్పిని దూరం చేసుకోవచ్చు. సైనస్‌ను తొలగించుకోవచ్చు. చికెన్ శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఎనర్జీని సైతం అందిస్తుంది. అలాంటి చికెన్ సూప్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
బోన్‌ విత్ చికెన్ : పావు కేజీ 
నువ్వుల నూనె - మూడు టీ స్పూన్లు  
ఉల్లి తరుగు - అర కప్పు 
టమోటా తరుగు - అర కప్పు  
మిర్చి పౌడర్ - ఒక స్పూన్ 
పసుపు పొడి - పావు టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్ 
కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు 
ఉప్పు, నీరు - తగినంత 
మిరియాల పొడి - అర టీ స్పూన్ 
జీలకర్ర పొడి - అర టీ స్పూన్
సోంపు పొడి - అర టీస్పూన్ 
ధనియాల పొడి - అర టీ స్పూన్ 
ఎండు మిర్చి పౌడర్- పావు టీ స్పూన్ 
 
తయారీ విధానం:
ముందుగా స్టౌ మీద కుక్కర్ పెట్టి శుభ్రం చేసుకున్న చికెన్‌ను కాస్త నూనెలో వేపుకోవాలి. దీంతో పాటు కరివేపాకు తరుగు, టమోటా, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేర్చుకోవాలి. సూప్‌కు తగినంత నీరును చేర్చుకోవాలి. ఉప్పు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. చికెన్ ఉడికాక మిరియాల పొడి, సోంపు పొడి, ఎండుమిర్చి పౌడర్, ధనియాల పొడి చేర్చి 2 నిమిషాలు మరిగించి దించేయాలి. అందులో కొత్తిమీర తరుగును చేర్చి సూప్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేయండి. చికెన్ సూప్ రెడీ..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనం ఇలా చేస్తే ఆరోగ్యం... తెలుసుకోండి...