వర్షాకాలం రాగానే జల్లుల్లో వేడివేడిగా, రుచికరంగా ఆహారం తినాలనిపిస్తుంది. ముఖ్యంగా నోటికి కాస్త కారంగానూ, కరకరలాడుతుంటే ఆ టేస్టే వేరు. అలాంటి పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఇంటిలో తయారు చేసినవైనా, వీధిలో వేడివేడిగా వేసేవైనా పకోడీల టేస్ట్ సూపర్. వీటిని పుదీనా సాస్ లేదా చింతపండు చట్నీతో తింటే రుచిగా వుంటాయి. వర్షంలో వేడివేడిగా కాఫీ తాగితే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
సమోసా స్పైసీ ఫుడ్ వర్షంలో తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి. ఆలూ పరోటా- పెరుగు చట్నిని వర్షపు తుంపరలు పడుతున్నప్పుడు వేడివేడిగా తింటే ఆ రుచి చాలా బాగుంటుంది. పావ్ భాజీ. ఈ వంటకం వర్షాకాలంలో ఇష్టమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.
ఆలూ చాట్ లేదా ఆలూ టిక్కీ, చల్లటి వర్షంలో వీటిని టేస్టే చేసి చూడాల్సిందే. మొక్కజొన్న పొత్తులు. స్పైసీ ఫుడ్‌ని ఇష్టపడేవారు మొక్కజొన్నను కాల్చి వేడివేడిగా తింటుంటే భలే రుచిగా వుంటాయి.