రుచికరమైన రొయ్యల మంచూరియా టేస్ట్ చేయాలా...!
, సోమవారం, 2 జనవరి 2012 (18:16 IST)
కావలసిన పదార్థాలు:రొయ్యలు : మూడొందల గ్రాములు, ఉల్లిపాయ : ఒకటి, సెనగపిండి : అరకప్పు, అల్లం : కాస్త, వెల్లుల్లి : నాలుగు, పచ్చిమిర్చి తరుగు : రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు : రెండు చెంచాలు, నూనె : సరిపడా, ఉప్పు : తగినంత.తయారు చేసే విధానం:మొదట రొయ్యలను శుభ్రం చేసి పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్టు చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలను సన్నగా తరిగి అందులో సెనగపిండి, ఉల్లిపాయల పేస్టు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కాస్త ఉప్పు వేసి, కాస్త నీళ్శు చల్లి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి వేడయ్యాక, మిశ్రమాన్ని ఉండలుగా చేసి నూనెలో వేయాలి. ఈ మిశ్రమం బంగారు రంగులోకి వచ్చాక తీసేస్తే రొయ్యల మంచూరియా రెడ్డీ...