Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్నూలులో తమ మొట్టమొదటి చేనేత చీరల ప్రదర్శన నిర్వహించబోతున్న తనైరా

కర్నూలులో తమ మొట్టమొదటి చేనేత చీరల ప్రదర్శన నిర్వహించబోతున్న తనైరా
, గురువారం, 15 ఏప్రియల్ 2021 (22:32 IST)
టైటాన్‌కు చెందిన అతి పిన్నవయసు కలిగిన బ్రాండ్‌, తనైరా 16 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్‌ 2021వ తేదీ( శుక్రవారం నుంచి సోమవారం వరకూ) నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన చేనేత చీరలతో ఓ ప్రదర్శన మరియు అమ్మకంను ఉదయం 11 గంటల నుంచి తనిష్క్‌ షోరూమ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఎస్‌వీ కాంప్లెక్స్‌, ఆర్‌ఎస్‌ రోడ్‌, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌- 518004 వద్ద చేయనుంది. ఈ ప్రదర్శనకు విచ్చేసిన సందర్శకులు తనైరా యొక్క ప్రత్యేకమైన చేనేత చీరలను వీక్షించవచ్చు. వీటిలో చందేరీ, మహేశ్వరి, టస్సర్‌, కాంజీవరం, బెనారస్‌ నుంచి 1500కు పైగా చేనేత చీరలను మరియు భారతదేశంలోని పలు ప్రాంతాలలో చేతితో రూపొందించిన చీరల కలెక్షన్‌ను వీక్షించవచ్చు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 30% వరకూ రాయితీని సైతం ఈ బ్రాండ్‌ అందిస్తుంది.
 
కర్నూలు ప్రదర్శన గురించి శ్రీమతి రాజేశ్వరి శ్రీనివాసన్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, తనైరా మాట్లాడుతూ, ‘‘రాయలసీమ గేట్‌వేకు మా పాపప్‌ ప్రదర్శనను తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాము. అత్యుత్తమమైన భారతదేశాన్ని ఒకే గూటి కిందకు తీసుకురావడం ద్వారా మా వినియోగదారులకు అత్యుత్తమమైనది అందించాలన్నది మా లక్ష్యం. బెనారసీ, కాంజీవరం, సౌత్‌ సిల్క్‌, టస్సర్‌, సిల్క్‌ కాటన్‌, మహేశ్వరి నుంచి చందేరీ వరకూ మా నూతన శ్రేణి చీరలను ప్రత్యేకంగా తీర్చిదిద్దంతో పాటుగా ప్రత్యేకమైన సమ్మర్‌ డిజైన్లను సైతం ఇక్కడకు తీసుకువచ్చాం. భారతదేశ వ్యాప్తంగా పలు  ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన ఈ కలెక్షన్‌తో పాటుగా మా అంతర్గత డిజైన్లకు వివేకవంతులైన ఇక్కడి మహిళల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తుందనే విశ్వాసంతో ఉన్నాం’’ అని అన్నారు.
 
కర్నూలులో విస్తృతశ్రేణి కలెక్షన్స్‌ను తనైరా ప్రదర్శిస్తుంది. వీటిలో తనైరా యొక్క నూతన జోడింపులో ముగ్గురు దేవతలు-దుర్గ, లక్ష్మి, సరస్వతి యొక్క సాంస్కృతిక, డిజైన్‌ అంశాల స్ఫూర్తితో ప్రత్యేకమైన చీరల కలెక్షన్‌ ‘తస్వి’ సైతం ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్‌లో సమ్మర్‌ మెమరీస్‌ కలెక్షన్‌ సైతం ప్రదర్శిస్తున్నారు. ఈ కలెక్షన్‌కు వేసవి సీజన్‌ స్ఫూర్తి. బాల్య జ్ఞాపకాలను తీసుకురావడంతో పాటుగా తేలికపాటి భావాన్నీ ఇది తీసుకువస్తుంది. అలాగే ‘ఎసెన్షియల్స్‌ బై తనైరా’ కలెక్షన్‌ సైతం ప్రదర్శిస్తున్నారు. దీనిలో జార్జియస్‌ సిల్క్‌, టస్సర్‌, కాటన్‌ శారీస్‌ వంటివి చీరలను ధరించడాన్ని అమితంగా ఇష్టపడే మహిళల కోసం అందుబాటులో ఉంచారు. చీరలు, బ్లౌజులు, దుపట్ట, స్టోల్‌, సూట్‌ సెట్స్‌, ఫ్యాబ్రిక్స్‌, మాస్క్స్‌ సైతం ఇక్కడ ప్రదర్శిస్తారు.
 
ఆరంభమైన నాటి నుంచి తనైరా విజయవంతంగా దేశవ్యాప్తంగా 14 స్టోర్లను ప్రారంభించింది. బెంగళూరులో ఇందిరా నగర్‌, జయనగర్‌, కమర్షియల్‌ స్ట్రీట్‌, ఒరియన్‌ మాల్‌ మరియు ఫోనిక్స్‌ మార్కెట్‌ సిటీ మాల్‌లలో నిర్వహిస్తుంది. ఢిల్లీలో ఈ బ్రాండ్‌ మూడు స్టోర్లను సౌత్‌ ఎక్స్‌, యాంబియన్స్‌ మాల్‌, వసంత్‌ కుంజ్‌ మరియు ద్వారక; హైదరాబాద్‌లో ఒక స్టోర్‌, పూనెలో ఔంధ్‌ వద్ద మరోటి నిర్వహిస్తుంది. ఈ బ్రాండ్‌ మూడు స్టోర్లను ముంబైలోని ఘట్కోపర్‌, ఇనార్బిట్‌ మాల్‌ వాషి మరియు ఇటీవలనే బాంద్రాలో టర్నర్‌ రోడ్‌ వద్ద నిర్వహిస్తుంది. ఈ బ్రాండ్‌ మెరుగైన షాపింగ్‌ అనుభవాలను అందించడంతో పాటుగా పూర్తి స్ధాయిలోని స్టైల్‌ స్టూడియోను నిర్వహిస్తుంది. దీనిలో రెడీ టు వేర్‌ బ్లౌజులు, కస్టమైజేషన్‌ మరియు టైలరింగ్‌ సేవలు వంటివి మీ షాపింగ్‌ను పరిపూర్ణం చేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్యాటీ లివర్ పారాహుషార్‌: డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి