Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరలక్ష్మి కలెక్షన్ 2022: దేవతలా మెరిసిపోండి అనే క్యాంపెయిన్‌తో రిలయన్స్ జ్యువెల్స్

Advertiesment
jewels
, బుధవారం, 10 ఆగస్టు 2022 (16:41 IST)
భారతదేశంలోని ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్, రిలయన్స్ జ్యువెల్స్, వరలక్ష్మీ వ్రతం పండుగను పురస్కరించుకొని తమ ప్రత్యేక వరలక్ష్మి కలెక్షన్‌ను ప్రారంభించింది, ఇక్కడ భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు లక్ష్మీదేవిని పూజిస్తారు. తనంతట తానుగా దేవతలా ప్రతిబింబించే ప్రతి మహిళా జరుపుకొనే లక్ష్యంతో 'గ్లో లైక్ ఏ గాడెస్’ అనే సేకరణ కోసం బ్రాండ్ ప్రచారం ఉద్దేశించబడింది.
 
దేవత యొక్క దివ్యత్వం, కృప మరియు తేజస్సు నుండి ప్రేరణ పొందిన ఈ సేకరణ, మహిళలందరూ తమ అంతర్గత దేవతను ఆలింగనం చేసుకోవడానికి ఒక గుర్తు. దక్షిణ భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు సంప్రదాయాలను వెలికితీసే ఈ ఆభరణాలను ప్రాంతీయ అభిరుచులు, సాంస్కృతిక సూక్ష్మాంశాలు, శైలులను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. ప్రచారం, రూపకల్పనలు రెండూ పవిత్రమైన కల్పవృక్షం నుండి ప్రేరణ పొందాయి, ఈ వృక్షం లోతైన ఆధ్యాత్మిక, పౌరాణిక శక్తులను కలిగి ఉందని భక్తులు విశ్వసిస్తారు, సముద్ర మంథన్ పురాతన కథల నుంచి ఇది ఉద్భవించింది.
 
నెక్లెస్‌లు, చెవిరింగులు, గాజులు మరియు ఉంగరాలతో సహా సంక్లిష్టంగా రూపొందించబడ్డ సంప్రదాయ ఆభరణాలు ఈ కలెక్షన్లో భాగం అవుతాయి. 22kt పసుపు బంగారం, పురాతన బంగారు దేవాలయ డిజైన్‌లలో రూపొందించబడి, రంగు రాళ్లతో అలంకరించబడిన, ప్రతి బంగారు ఆభరణపు డిజైన్ మరోదానికి భిన్నంగా ఉంటుంది, ఇది కలెక్షన్‌ని అన్ని విధాలుగా ప్రత్యేకంగా చేస్తుంది. అద్భుతమైన డైమండ్ కలెక్షన్‌లో చోకర్లు మరియు హరామ్ సెట్‌లు, పెండెంట్‌లపై పెర్ల్ డ్రాప్ యాక్సెంట్‌లు, రంగు రాళ్లు, గుదిగుచ్చి అద్దిన డైమండ్‌లు ఉంటాయి. దేవత దయ, సంయమనం, దైవత్వం ప్రతి ముక్కలో అందంగా ప్రతిబింబించబడతాయి, పండుగల సమయంలో ప్రతి మహిళకు ఇది ఖచ్చితమైన అలంకరణ.
 
ఈ సేకరణ ప్రారంభం గురించి రిలయన్స్ జ్యువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ, 'పవిత్రమైన పండుగను ఘనంగా జరుపుకోవడం, సంగ్రహించడమే ఈ మొత్తం సేకరణలో మా విజన్. ఈ ప్రాంత కస్టమర్‌ల అభిరుచులకు అనుగుణంగా ఉండే ఈ విభిన్న శైలులను తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది. దక్షిణ భారతదేశానికి చెందిన మా అత్యంత ఉద్వేగభరితమైన డిజైన్ బృందాలు… అందమైన డిజైన్లను సృష్టించడానికి ప్రతి క్లిష్టమైన డిజైన్ వివరాలు, ఎలిమెంట్స్ జతకూరేలా సేకరణపై జాగ్రత్తగా పనిచేశాయి అని అన్నారు.
 
ఈ సంవత్సరం 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న రిలయన్స్ జ్యువెల్స్… పండుగలు మరియు సందర్భాలు, అనేకమంది జీవితాలు, ఇళ్లలో చాలా ప్రియమైన, ప్రజాదరణ పొందిన భాగంగా మారింది. ప్రతి సంవత్సరం కస్టమర్‌ల జీవితంలోని ప్రతి సందర్భం, క్షణాలతో జ్యువెలరీ ద్వారా ఒక భావోద్వేగ సంబంధాన్ని సృష్టించడంపై బ్రాండ్ దృష్టి సారించింది. వరలక్ష్మి కలెక్షన్ వంటి కలెక్షన్లతో ఈ సంవత్సరం కూడా అనేక సందర్భాలలో రిలయన్స్ జ్యువెల్స్ వెలుగులద్దుతూ, ప్రజలను ప్రేరేపించే ‘బి ద మూమెంట్’లా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. వరలక్ష్మి కలెక్షన్ 2022లో బ్రాండ్ నుంచి ఎంచుకోగల సున్నితమైన శ్రేణికి అదనంగా, కంపెనీ ఆగస్టు 31 వరకు కస్టమర్ లందరికీ బంగారు ఆభరణాల తయారీ, డైమండ్ జువెలరీ విలువపై 25% వరకు తగ్గింపుతో ప్రత్యేక ఆఫర్‌ని అందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పైనాపిల్ తింటే ఆరోగ్య సమస్యలు ఏమయినా వస్తాయా?