Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బి. జీరో 1 కడ బ్రాస్‌లెట్‌ను విడుదల చేసిన బల్గారి

Advertiesment
B.zero1 Kada Bracelet

ఐవీఆర్

, బుధవారం, 17 జనవరి 2024 (18:05 IST)
కాలాతీత డిజైన్‌లకు ప్రసిద్ధి చెందిన, అద్భుతమైన రోమన్ హై జువెలర్, బల్గారి, సంప్రదాయ భారతీయ కంకణమైన కడకు నివాళులర్పిస్తూ బి. జీరో 1  కడ బ్రాస్‌లెట్‌‌ను విడుదల చేసింది. భారతదేశంకు ప్రత్యేకమైన ఈ సృష్టిని మిరుమిట్లు గొలిపే ఎల్లో గోల్డ్‌తో రూపొందించారు. ఇది విలువైన లోహాలు, రాళ్లతో భారతదేశం యొక్క దీర్ఘ-కాల సాంస్కృతిక అనుబంధానికి నివాళులు అర్పిస్తోంది. ఇది లోతుగా పాతుకుపోయిన సంప్రదాయాలు, సమకాలీన, ప్రపంచ దృక్పథాల సంగమం, "ఆధునిక భారతదేశం"కు ప్రాతినిధ్యం వహిస్తుంది. బి. జీరో 1 యొక్క దార్శనిక సంకేతాలను ఆలింగనం చేసుకుంటూ, బలం, సంకల్పాన్ని ప్రేరేపించే స్పైరల్ డిజైన్ ద్వారా మూవ్మెంట్, సర్క్యూలరిటీ, తేలికపాటి యొక్క భావనను వ్యక్తపరుస్తుంది. 
 
ఇది సాంప్రదాయ బి. జీరో 1 డిజైన్ కంటే మరింత భారీగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించబడింది, పురుషులు దీనిని గడియారాలు లేదా ఇతర బ్రాస్‌లెట్‌లతో కలపడానికి లేదా స్టాండ్-అలోన్ స్టేట్‌మెంట్ పీస్‌గా ధరించడానికి అవకాశం కల్పిస్తుంది. దాని వైవిధ్యత క్యాజువల్, ఫార్మల్ వస్త్రధారణ, అలాగే సాంప్రదాయ వస్త్రాలతో సౌకర్యవంతంగా జత చేయడానికి తీర్చిదిద్దబడినది.
 
ఈ సందర్భంగా బల్గారి సీఈఓ జీన్-క్రిస్టోఫ్ బాబిన్ మాట్లాడుతూ, "ఈ ముఖ్యమైన ఆవిష్కరణతో భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన కడాను గౌరవించాలనుకుంటున్నాము. బి. జీరో 1 కడ బ్రాస్‌లెట్ సమకాలీన డిజైన్‌ను, గతం యొక్క స్థిరత్వాన్ని సమకాలీన రూపంలో నిన్న మరియు నేటికి పునర్నిర్వచిస్తూనే, అదే సమయంలో భారతదేశపు స్ఫూర్తితో సంప్రదాయం ప్రతిబింబించే ఆభరణంగానూ నిలుస్తుంది. ఆయుష్మాన్ ఖురానాను బల్గారీ ఇండియా యొక్క బ్రాండ్ స్నేహితుడిగా కలిగి ఉండటంను ఒక గౌరవంగా భావిస్తున్నాము; బహుముఖ ప్రతిభ, భారతదేశం యొక్క విభిన్న సంస్కృతి పట్ల అతని అభిరుచి అతనిని బల్గారి లక్ష్యంకి పరిపూర్ణ స్వరూపులుగా చేశాయి" అని అన్నారు. 
 
బ్రాండ్ యొక్క స్నేహితుడు, ఆయుష్మాన్ ఖురానా, కొత్త సృష్టి- దానిలో దాగి ఉన్న లోతైన అంతర్గత అర్ధంతో తన సంబంధాన్ని, జీవితం యొక్క ప్రామాణికత ను వెల్లడించారు. అతను తన సృజనాత్మక వ్యక్తీకరణ తన ఆకాంక్షలు, విలువలకు మార్గం సుగమం చేయడం, అనంతమైన అవకాశాలతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడే విధానాన్ని ప్రస్తావించారు. "ఆధునికతతో సంప్రదాయాన్ని మిళితం చేసే ఈ అద్భుతమైన ప్రచారంలో భాగం కావడం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. బి. జీరో 1 కడ బ్రాస్‌లెట్ ధైర్యం, వ్యక్తిత్వానికి చిహ్నం. ఇది భవిష్యత్తులోకి అడుగుపెడుతున్నప్పుడు మన మూలాలను ఆలింగనం చేసుకునేలా ఉంటుంది. సంప్రదాయం, ఆధునికత కలయికను వేడుక జరుపుకునే ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు థ్రిల్‌గా ఉన్నాను" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తపోటును అదుపు చేయకపోతే ఏం చేస్తుందో తెలుసా?