Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సింహా' మార్కు బోయపాటి 'లెజెండ్' చిత్రంలో బాలయ్య ఏం చేశాడు...?

'సింహా' మార్కు బోయపాటి 'లెజెండ్' చిత్రంలో బాలయ్య ఏం చేశాడు...?
, శుక్రవారం, 28 మార్చి 2014 (16:48 IST)
WD
లెజెండ్ నటీనటులు : బాలకృష్ణ, సోనాల్‌ చౌహాన్‌, రాధికా ఆప్టే, జగపతి బాబు, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రావు రమేష్‌ తదితరులు; సంగీతం: దేవీశ్రీప్రసాద్‌, మాటలు: ఎం.రత్నం, కెమెరా: సి. రామ్‌ప్రసాద్‌, నిర్మాతలు: అనిల్‌ సుంకర, రామ్‌ ఆచంట, గోపి ఆచంట. కథ, కథనం, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

ముందుమాట...
బోయపాటి శ్రీను చిత్రాలంటే అందులో యాక్షన్‌ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందులో హింస ఉంటుంది. చేసేది అగ్రహీరోలతో కాబట్టి దానికి తగినట్లుగా చిత్రాన్ని మలుస్తుంటాడు. తెలుగు సినిమా కథను రకరకాల జిమ్మిక్కులతో చూపించే సత్తా ఉన్న బోయపాటి శ్రీను... బాలకృష్ణ కాంబినేషన్‌లో నాలుగేళ్ళ నాడు 'సింహా' తెచ్చాడు. ఆ తర్వాత బాలయ్యకు సరైన హిట్‌ లేదు. మళ్ళీ ఇద్దరి కలయికతో వచ్చిన ఈ చిత్రం ఇప్పటి రాజకీయ నేపథ్యం కూడా టచ్‌ చేశాడు. అది ఎలా ఉందో చూద్దాం.

కథ..
కృష్ణ (బాలకృష్ణ) విదేశాల్లో వ్యాపారం చేస్తుంటాడు. బ్రహ్మానందం అతన్ని గైడ్‌ చేస్తుంటాడు. అక్కడే సోనాల్‌ని ప్రేమిస్తాడు. అక్కడి కల్చర్‌కు అలవాటుపడ్డ ఆమెను... కృష్ణ ఊరైన కర్నూలుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తాడు బ్రహ్మానందం. వచ్చీరాగానే ఇక్కడ గొడవల్లో ఇన్‌వాల్వ్‌ అవ్వాల్సి వస్తుంది. ఓ రౌడీని దేహశుద్ధి చేసి ఆసుపత్రి పాలుచేస్తాడు. అతని తండ్రి జితేంద్ర(జగపతిబాబు).. ఆ ఊరిలో పెద్ద విలన్. సి.ఎం. కావాడానికి నానా కుయుక్తులు చేస్తుంటాడు. పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటాడు.

తన కొడుకును కొట్టినవాడి కుటుంబాన్ని నాశనం చేయాలని కృష్ణ చేసుకోవాల్సిన సోనాల్‌ను కిడ్నాప్‌ చేస్తాడు. అడ్డువచ్చిన కృష్ణను కాల్చేస్తాడు. వారి కుటుంబాన్ని చంపేయాలనుకున్న తరుణంలో జయదేవ్‌(మరో బాలకృష్ణ) రక్షిస్తాడు. అతన్ని చూసిన జితేంద్ర ఆశ్చర్యపోతాడు. కృష్ణ కుటుంబమంతా ఆయన్ను స్వాగతిస్తుంది. అసలు జయదేవ్‌ ఎవరు? జితేంద్రకు ఇతనికి గొడవలు ఏమిటి? అనేది సినిమా.

పెర్‌ఫార్మెన్స్‌
నందమూరి బాలకృష్ణ ఇందులో రెండు పాత్రలు పోషించాడు. విదేశాల్లో చదివిన కృష్ణగా యూత్‌ను ఆకట్టుకునే పాటలు, డాన్స్‌ చేశాడు. ఇక రెండో పాత్ర మీద భారమంతా. బాడీ లాంగ్వేజ్‌కు... అభినయానికి, పంచ్‌ డైలాగ్స్‌ ఇవన్నీ కలబోసి దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ పాత్రలో బాలకృష్ణ జీవించాడు.

ఇక జగపతిబాబు తొలిసారిగా విలన్‌ పాత్రలో నటించాడు. కొత్తగా అనిపిస్తాడు. నాచురల్‌గా ఉన్న గెటప్‌ ఆయనకు సూటయింది. రౌద్ర రసాన్ని విలన్‌, హీరో ఇద్దరూ బాగానే పండించారు. హీరోయిన్లు ఇద్దరూ ఉన్న హీరోకు ఉండాలన్నట్లుగా ఉంటుంది. ఇక బ్రహ్మానందం లేని సినిమాలేదు. ఈ చిత్రంలోనూ ఉన్నంత కాసేపు బ్రహ్మానందంతో 'థ్రిల్‌' ఫీలవ్వాలని కోరుకునే వ్యక్తిగా నవ్విస్తాడు. ఆ సన్నివేశం బాగుంది. ఇక మిగిలిన వారంతా తమ పాత్రలకే పరిమితమయ్యారు.

టెక్నికల్‌గా....
రామప్రసాద్‌ సినిమాటోగ్రఫీ హైలైట్‌. యాక్షన్‌ సన్నివేశాల్లో చాలా స్పష్టంగా కన్పిస్తుంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం పర్వాలేదు. సాహిత్యపరంగా పెద్దగా లేకపోయినా బాగున్నాయి. చాలా హెవీ హింస ఈ చిత్రంలో చాలా మటుకు ఎడిటిర్‌కు పని తగిలింది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సరిపోయింది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్‌ వాడారు.

విశ్లేషణ :
ఈ చిత్రం మొదటి భాగం చాలా సరదాగా సాగుతుంది. కథాపరంగా కొత్తదనం లేకపోయినా... చెప్పే విధానం కొత్తగా ఉంది. లెజెండ్‌గా బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌ మార్కులు పడతాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబును చూస్తారు. సంభాషణల పరంగా పంచ్‌లకే ప్రాధాన్యత ఇచ్చారు. అడవిలో సింహానికి రాజువని ఎవరు చెప్పారు... అలాగే బయట ప్రజల్ని హింసిస్తున్న వారిని ఎదిరించమని ఎవ్వరూ చెప్పక్కర్లేదంటూ.... సన్నివేశపరంగా వచ్చే సంభాషణలు ఫ్యాన్స్‌‌కు పండుగ లాగా ఉంటాయి.

అయితే.. ఇప్పటి పాలిటిక్స్‌ గురించి టచ్‌ చేసినట్లు ముగింపు ఉంటుంది. సి.ఎం.పదవి కోసం ఎంతమంది ఎం.ఎల్‌.ఎ.లనైనా కొనడానికి సిద్ధపడే కాబోయే సి.ఎం.. అమ్ముడు పోవడానికి ఎం.ఎల్‌.ఎ.లు చెప్పిన కారణాలు... ఇప్పటి రాజకీయ నాయకుల తీరుకు తార్కాణాలుగా ఉన్నాయి.

బాలకృష్ణ చేసిన హిట్‌ ఫార్ములా తరహాలోనే ఈ చిత్రం సాగుతుంది. ప్రతి సన్నివేశం హైలెట్‌ అవ్వాలని దర్శకుడు చేశాడు. కాని అన్నీ అలా కురదలేదు. దుర్మార్గుల్ని, రాజకీయనాయకుల్ని ప్రశ్నించే తత్త్వం కామన్‌మేన్‌కు నచ్చుతుంది. అందులోనూ బాలయ్య చెప్పే డైలాగ్స్‌ కూడా నచ్చుతాయి. అందుకే ఫ్యాన్స్‌, మాస్‌ కోసమే దర్శకుడు ఇటువంటి కథను ఎంచుకున్నాడు.

ఆడది పుడితే పురిటిలోనే చంపేసే సంస్కృతి సందర్భంగా బాలయ్య చెప్పే డైలాగ్స్‌ మహిళలు నచ్చుతాయి. ఇలా సమాజంలో జరిగే కొన్ని సంఘటలనకు కలిపి చిత్రంగా మలిచాడు. కానీ.. ముగింపు మాత్రం రొటీన్‌గానే ఉంది. ఇంకాస్త డెప్త్‌గా ఉంటే బాగుండేది. ఫస్టాఫ్‌లో ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌.. ఎంత హైలైట్‌ అయిందో అంతే హైలెట్‌గా ముగింపు ఉంటే బాగుండేది. ఇది ఫక్తు బాలయ్య మార్కు సినిమా. సెకాండాఫ్‌లో టైటిల్‌ గురించి ఓ డైలాగ్‌ ఉంటుంది. ప్రతి మనిషి లెజెండ్‌.. ఎదిరించే తత్వం నేర్చుకోవాలి. లేదంటే మనల్నే తొక్కేస్తారు. మీరంతా లెజెండ్సే అని... జనాల్ని చూపిస్తూ బాలయ్య చెబుతాడు. అంటే ఫ్యాన్సే ఆయన దృష్టిలో లెజెండ్‌.

Share this Story:

Follow Webdunia telugu