జూలైలో విడుదల కానున్న భూమిక "తకిట తకిట"
కొత్త తారలతో భూమికా చావ్లా ముఖ్యపాత్రలో, కింగ్ నాగార్జున, అరుంధతి అనుష్క స్పెషల్ అప్పియరెన్స్‌తో డౌన్‌టౌన్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీహరి నాను దర్శకత్వంలో భూమిక చావ్లా సమర్పణలో భరత్ ఠాకూర్ నిర్మిస్తున్న తకిట తకిట చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత భరత్ ఠాకూర్ మాట్లాడుతూ... ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తకిట తకిట షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ 9న ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 18న ఆడియో రిలీజ్ చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.దర్శకుడు శ్రీహరి నాను మాట్లాడుతూ... ఒక మంచి చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనతో భరత్ ఠాకూర్, భూమిక ఈ చిత్రాన్ని ఎంతో అభిరుచితో నిర్మిస్తున్నారు. ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుదన్న నమ్మకం నాకు ఉంది. ఈ చిత్రం ద్వారా చాలామంది కొత్త ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు. అందరూ చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్ చేశారు. తకిట తకిట తెలుగులో ఓ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టబోతోంది అన్నారు.ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, మాటలు: బి.వి.ఎస్.రవి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమేరా: కె.కె. సెంథిల్ కుమార్, సంగీతం: బోబో శశి, సమర్పణ: భూమిక చావ్లా, నిర్మాత: భరత్ ఠాకూర్, కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీహరి నాను.