Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెరకెక్కుతున్న "తేరా బిన్ లాడెన్"

Advertiesment
తేరా బిన్ లాడెన్
IFM
ఒసామా బిన్ లాడెన్ పేరు చెబితే ప్రపంచం గడగడా వణుకుతుంది. ఈ పేరునే సినిమాకు ఉపయోగిస్తూ వాక్‌వాటర్ మీడియా బ్యానర్‌పై అభిషేక్ శర్మ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. "తేరా బిన్ లాడెన్" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో పాకిస్తాన్‌కు చెందిన అలీ జాఫర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక చిత్ర విశేషాలను చూస్తే... ఇది పూర్తి హాస్యప్రధానమైన చిత్రం. అమెరికాకు వెళ్లాలన్న కలను నిజం చేసుకోవలనుకునే ఓ పాకిస్తాన్ యువ పాత్రికేయుడు పడే పాట్లను అత్యంత హాస్యభరితంగా తెరకెక్కిస్తున్నారు.

సదరు జర్నలిస్టు ఎన్నిసార్లు వీసాకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నిరాకరణకు గురవుతుంటుంది. దీంతో విసిగి వేసారిన ఆ రిపోర్టర్ ఒసామా బిన్ లాడెన్ అవతారంలోకి మారతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది మిగిలిన సినిమా.

Share this Story:

Follow Webdunia telugu