షూటింగ్ లేకపోతే పిచ్చెక్కి పోతోంది: "లీడర్" రానా
అది రామానాయుడు స్టూడియోలోని కొత్తగా కట్టిన భవంతి. అక్కడే కొత్తగా ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. అందులో ఓ భాగం రానా ఆఫీస్. అక్కడికి హీరోగా కాకముందే గ్రాఫిక్ వర్క్ కోసం వస్తుండేవారు. ఇప్పుడు తను రావడం చాలా కొత్తగా ఉందనీ, అందరూ కొత్తగా గౌరవిస్తున్నారని రానా అంటున్నారు. ఆయన రూమ్‌కు వెళ్లగానే... ఆయనే ఎదురుగా వచ్చారు. "హాయ్ రానా..! ఎలా ఉన్నార"ని పలుకరించి...హీరో అయ్యాక ఎన్నిసార్లు ఆఫీసుకు వచ్చి ఉంటారు..? నేను హీరో కాకముందు రోజూ ఇక్కడికి వచ్చేవాడిని. నా పని నేను చేసుకుని వెళ్లిపోతుండేవాడిని. కానీ లీడర్ సినిమా చేశాక.. రావడం కుదరలేదు. హిందీ సినిమా షూటింగ్ కొన్ని రోజుల గ్యాప్ రావడంతో ఇక్కడికి వచ్చాను. అదే స్టాఫ్ నన్ను కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు... గౌరవ మర్యాదలు కొంచెం ఎక్కువ చేస్తున్నట్లు గ్రహించాను.ఖాళీ టైమ్‌లో ఏం చేస్తుంటారు..? నిజం చెప్పాలంటే... చాలా బోర్‌గా ఉంది. లీడర్ షూటింగ్‌లో టైమ్ తెలియలేదు. ఆ తర్వాత వెంటనే హిందీ చిత్రం "దమ్మారేదమ్" సినిమాలో షూటింగ్‌లో పాల్గొంటున్నాను. అనుకోకుండా 10 రోజులు గ్యాప్ వచ్చింది. దాంతో పిచ్చెక్కిపోయినట్లుంది. ఏదో తెలీని వెలితిలా ఉంది. షూటింగ్‌లో ఇంత పవర్ ఉందా అనిపించింది. మరి మీ బాబాయ్‌గారి సలహాలు తీసుకోపోయారా...? కరెక్టేగానీ... ఆయన ఈమధ్య ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నారు. సినిమాల గురించి మేమందరం చర్చించుకుంటాం. ఖాళీ సమయాల్లో ఏదో ఒకటి చేయాలని చెబుతారు. అంతకుముందు ప్రొడక్షన్ వ్యవహారాలు తెలుసు కనుక అవి చూసుకోవడానికి వచ్చేవాడిని. మధ్యలో కొన్ని స్క్రిప్ట్‌లు కూడా చదివాను.మరి కొత్త చిత్రం ఎప్పుడు..? ప్రస్తుతం హిందీ తర్వాత తమిళంలో శ్రీరాఘవన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. ఆ కథ 5వేల సంవత్సరాల కాలం నాటిది. అంటే... అది చరిత్రకు దొరకని కథ. అంతా అభూతకల్పన. అదెలా ఉంటుందంటే.. యుగానికి ఒక్కడు తరహాలో ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. హీరోయిన్ ఎంపిక కూడా కావాలి. నా ఎత్తుకు సరైన జోడీకోసం వేట మొదవలెట్టారు.తెలుగులో ఏ తరహా చిత్రం చేయాలనుంది...? బొబ్బిలి రాజా తరహాలో చిత్రం చేయాలనుంది. అందులో పిల్లల నుంచి పెద్దలకు నచ్చే అంశాలున్నాయి.లీడర్‌లో మీరు ముభావంగా ఉన్నారనే విమర్శలు వచ్చాయి...? అవును. నేనూ విన్నాను. ఇంకా వాయిస్ డెవలప్ కావాలని విన్నాను. ఆ సినిమా చాలా నేర్పింది. ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా నాలెడ్జ్ సంప్రదిస్తాం. అవి తర్వాత చిత్రంలో మెరుగులు దిద్దుకుంటాను. హిందీ సినిమాలో అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్నా. అక్కడ ప్రొడక్షన్లవాల్యూస్, స్క్రిప్ట్ వర్క్ చూసి ఆశ్చర్యపోయా. వారు సెట్‌పైకి వెళ్లేముందే అన్నీ క్షుణ్ణంగా రాసుకుంటారు. ఇది తెలుగులో కొద్ది దర్శకులు మినహా అలా చేయరు.మీరు హీరో కాకపోతే ఏమయ్యేవారు..? నేను హీరో అవుతానని రెండు సంవత్సరాల వరకూ తెలీదు. చిన్నతనం నుంచి ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాడిగా ఏదో ఒకటి చేయాలని ఉండేది. అందుకే ప్రొడక్షన్ వైపు, అధునాతన టెక్నికల్ వర్క్‌ను చూస్తుండేవాడిని. ఆ రంగంలో హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమాను ధీటుగా చేయాలనుకునేవాడిని. హీరో అనేది అనుకోని అవకాశం.హీరోగా శాటిస్‌ఫై అయ్యారా...? డెఫినెట్లీ. లీడర్ సినిమా చేసేముందు కొంత భయమేసింది. ప్రారంభమే పొలిటికల్ సినిమా. ఏదైనా అయితే అటుఇటుగా ఉంటుంది. అందులోనూ శేఖర్ కమ్ముల క్యూట్ లవ్‌స్టోరీలు తీసిన ఆయన సడెన్‌గా రాజకీయంవైపు మళ్లారు. ఆయనకూ కొత్తే. నాపై ప్రయోగం చేస్తున్నారా అనిపించింది. షూటింగ్ చేస్తున్నకొద్దీ... ఏదో కొత్తతరహాలో ఉండే అనిపించింది. సినిమా చూశాక జనాలు బాగా చేశావ్... సరిపోయాడు క్యారెక్టర్‌కు అంటుంటే చాలా ఆనందమేసింది. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రీమియర్ చూశాక.. తెలిసినవారు, తెలియనివారు ఇంటర్వెల్‌లో నాన్నను అభినందిస్తుంటే వారికంటే నేనే ఎక్కువ ఆనందపడ్డాను.వెంకటేష్‌తో కలిసి నటించే ఆలోచన ఉందా...? తప్పకుండా చేస్తాను. బాబాయ్‌తో కలిసి నటించే కథకోసం కసరత్తులు జరుగుతున్నాయి. కొంతమంది నాగచైతన్యతో కలిసి రాసే కథను కూడా తయారు చేస్తున్నారు. ఏదైనా అన్ని కుదిరితేమా బ్యానర్‌లోనే చేస్తాం.5
వేల సంత్సరాల కథ ఏ బ్యానర్‌లో ఉంటుంది.. సురేష్ ప్రొడక్షన్స్‌లోనే. అప్పటి కథను చెప్పాలంటే... బడ్జెట్‌లో లిమిట్‌లు ఉండకూడదు. అందుకని వేరే వారికి బరువు పెట్టడం. ఎందుకని మా బ్యానర్‌లో చేస్తున్నాం. ఇది ఒక ట్రెండ్ సెట్టర్‌గా ఉంటుంది. వారసులపై ఇండస్ట్రీలో కామెంట్ ఉంది...? ఏ రంగంలోనైనా వారసులు రావడం సహజం. దాన్ని భూతద్దంలో చూడటం అవసరం. ప్రేక్షకులు ఆదరిస్తున్నారా లేదా అనేది చూడాలి. నేను వారసుడినైనా సినిమా బాగోపోతో చూడరు కదా... అలా చాలామంది ఉన్నారు.