Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మగువలకు చీరకట్టే ఆకర్షణగా ఉంటుంది : దీక్షాసేథ్

Advertiesment
దీక్షా సేథ్
, సోమవారం, 16 ఏప్రియల్ 2012 (15:25 IST)
File
FILE
దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు తారలంటే అభిమానం ఎక్కువేనని అంటోంది దీక్షాసేథ్‌. 'మిరపకాయ్‌' చిత్రం తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చాయని, తెలుగు ప్రేక్షకులు తనకు మంచి గుర్తింపు ఇచ్చారని చెప్పింది.

తాజాగా 'రెబల్'‌, 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రాల్లో నటిస్తోంది. సినిమారంగంలో అడుగుపెట్టడానికి లక్ష్యాలేమీ ఏర్పరచుకోలేదు. వచ్చినవాటిని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా ఉంది. ఈ రంగంలోకి రాకపోతే... నేను నా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసేదాన్ని.

చిత్ర రంగానికి వచ్చాక దేశమంతా తెలిసిపోయాను. బాలీవుడ్‌లోకి వెళ్ళే ఆలోచనుందా? అని అడితే.. ప్రస్తుతం దక్షిణాదివైపే.. ఆ తర్వాత చూద్దాం అంటూ ముక్తసరి సమాధానం ఇచ్చింది. ఆదివారంనాడు ఓ వస్త్రదుకాణానికి గెస్ట్‌గా హాజరైంది. మగువలకు వస్త్రాలే ఆకర్షణనీయంగా ఉంటాయని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu